cloudfront

Advertisement


Home > Movies - Movie News

నాని విశ్లేషణ తప్పు.. కృష్ణార్జునులు ఫెయిల్

నాని విశ్లేషణ తప్పు.. కృష్ణార్జునులు ఫెయిల్

కొన్నేళ్లుగా సినిమా కథల పరంగా నాని లెక్క తప్పలేదు. అతడి విశ్లేషణలు కూడా తప్పలేదు. కానీ కృష్ణార్జున యుద్ధంతో మొత్తం మారిపోయింది. నాని స్టోరీ సెలక్షన్ మాత్రమే కాదు, అతడి ఎనాలిసిస్ కూడా గాడి తప్పిందనే విషయం ఇట్టే తెలిసిపోతోంది. రంగస్థలం సినిమాతో ముడిపెడుతూ నాని చెప్పిన లాజిక్ ఇప్పుడు అస్సలు వర్కవుట్ కావడం లేదు.

రంగస్థలం సినిమా సూపర్ సక్సెస్ అయింది కాబట్టి, జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారని, ఇదే ఊపులో కృష్ణార్జున యుద్ధం సినిమాకు కూడా అదే అలవాటు ప్రకారం ఆడియన్స్ వచ్చి సినిమాను హిట్ చేస్తారని విశ్లేషించాడు నాని. కానీ అతడి లెక్క తప్పింది. రంగస్థలం సినిమానే మరోసారి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప, కృష్ణార్జున యుద్ధం వైపు కన్నెత్తి చూడడం లేదు ప్రేక్షకులు.

80ల నాటి కథ, స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన కృష్ణార్జున యుద్ధం రెండో రోజు నుంచే డ్రాప్ అయింది. ఈ మూవీ వసూళ్లు ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి (నిన్నటితో) భారీగా తగ్గిపోయాయి. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఎంసీఏతో పోల్చుకుంటే.. కృష్ణార్జున యుద్ధం ఎక్కడో అథఃపాతాళంలో ఉంది. అటు ఓవర్సీస్ లో అయితే దీని పరిస్థితి మరీ దారణం.

బాక్సాఫీస్ బరిలో ఘోరంగా దెబ్బతిన్న కృష్ణార్జున యుద్ధంకు ఇవాళ్టి నుంచి మరింత గడ్డు పరిస్థితి. ఈ రోజు నుంచి మరో వారం పాటు ఈ సినిమా నిలబడ్డం చాలా కష్టం. అటు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను గంపగుత్తగా కొనేసుకున్న దిల్ రాజుకు షాక్ తప్పలేదు. ఏపీలో ఈ సినిమాను మంచి రేటుకే అమ్ముకున్న దిల్ రాజు, నైజాంలో సొంత రిలీజ్ కు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు.