Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాని సినిమా వైష్ణవ్ కు

నాని సినిమా వైష్ణవ్ కు

ఇప్పడు ఇండస్ట్రీ నిండా యంగ్ హీరోలే. ఒకరు వద్దంటే మరొకరు అందుకుంటారు. ఈ కథ ఒకరికే తప్ప మరొకరికి సూట్ కాదు అనే వ్యవహారం చాలా రేర్ గా వుంటుంది. రెగ్యులర్ ఫార్మాట్ కథలు దాదాపుగా చిన్న చిన్న మార్పులతో అందరికీ సెట్ అయిపోతాయి. 

అలాగే ఓ కథను నాని రిజెక్ట్ చేస్తే, అది కాస్తా ఇఫ్పుడు వైష్ణవ్ తేజ్ ఖాతాలో చేరింది. బోగవిల్లి ప్రసాద్ ఒక కొత్త డైరక్టర్ తో నానికి ఓ కథ చెప్పించారని తెలుస్తోంది. 

అది ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ కథ. దాంతో నాని సారీ చెప్పినట్లు తెలుస్తోంది. అదే కథను వైష్ణవ్ తేజ్ కు చెప్పిస్తే, ఓకె అన్నట్లు, త్వరలో పట్టాలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.

వైష్ణవ్ తేజ్ ఉప్పెన తరువాత  క్రిష్ జంగిల్ బుక్ ఫినిష్ చేసారు ఆ తరువాత అన్నపూర్ణ బ్యానర్ లో ఒకటి, భోగవిల్లి ప్రసాద్ బ్యానర్ లో మరోటి చేయాల్సి వుంది.

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

నారావారి కుటుంబంలో మాన‌సిన స‌మ‌స్య ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?