cloudfront

Advertisement


Home > Movies - Movie News

మరోసారి అతడికే ఛాన్స్

మరోసారి అతడికే ఛాన్స్

అజ్ఞాతవాసి తర్వాత ఇక తెలుగువైపు రాడని అంతా అనుకున్నారు. కానీ అనిరుధ్ మళ్లీ వచ్చాడు. నాని నటిస్తున్న జెర్సీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ సాంగ్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉండగా, ఇప్పుడిదే సంగీత దర్శకుడికి మరో ఛాన్స్ వచ్చింది. ఈసారి కూడా అనిరుధ్ కు అవకాశం ఇచ్చింది నానినే.

అవును.. తాజాగా ప్రారంభమైన నాని-విక్రమ్ కుమార్ సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు. నిజానికి జెర్సీ సినిమాకు అనిరుధ్ ఎంపిక వెనక ఉన్నది త్రివిక్రమ్. తనకు బాగా క్లోజ్ కాబట్టి నిర్మాతలకు చెప్పి అనిరుధ్ ను జెర్సీ సినిమాలో పెట్టించాడు త్రివిక్రమ్. అరవింద సమేత సినిమా కోసం అనిరుధ్ ను సెలక్ట్ చేసి మరీ పక్కనపెట్టేశారు. అందుకే తనే దగ్గరుండి జెర్సీ సినిమా ఆఫర్ ఇప్పించాడు.

కానీ విక్రమ్ కుమార్ సినిమా ఆఫర్ అనిరుధ్ కు రావడానికి మాత్రం పూర్తిగా నానినే కారణం. జెర్సీ సినిమాలో అనిరుధ్ వర్క్ నానికి బాగా నచ్చిందట. అందుకే ఏరికోరి మరీ విక్రమ్ కుమార్ సినిమా కోసం అనిరుధ్ ను మరోసారి రిపీట్ చేస్తున్నాడు.

జెర్సీ సినిమా షూటింగ్ మొన్ననే పూర్తయింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా విక్రమ్ కుమార్ సినిమాను ఇవాళ్టి నుంచే సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు నాని. ఓవైపు షూటింగ్ తో పాటు మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లకు చోటుంది. ఓ హీరోయిన్ గా ప్రియాంక అనే కొత్తమ్మాయిని తీసుకున్నారు. మరో ఇద్దరు హీరోయిన్లను త్వరలోనే ప్రకటిస్తారు.

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?