Advertisement

Advertisement


Home > Movies - Movie News

నా యాక్టింగ్ సీక్రెట్ అదే

నా యాక్టింగ్ సీక్రెట్ అదే

నానీకి నేచురల్ యాక్టర్ అనే పేరుంది. అతడి యాక్టింగ్ అంత సహజంగా ఉంటుంది కాబట్టి ఆ బిరుదు వచ్చింది. మరి అంత సహజంగా నటించేందుకు నాని చేసే హోం వర్క్ ఏంటి? అతడి యాక్టింగ్ సీక్రెట్ ఏంటి? ఎలాంటి సీక్రెట్ లేదంటున్నాడు ఈ హీరో.

"షాట్ కు 20 నిమిషాల ముందు దర్శకుడితో డిస్కస్ చేస్తాను. ఎలా చేయాలో చర్చిస్తాను. ఆ ఇన్ పుట్స్ తో ఫ్రెష్ గా వెళ్లినప్పుడు ఏదైనా మ్యాజిక్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనేది నా ఫీలింగ్."

ఇదే తన యాక్టింగ్ సీక్రెట్ అంటున్నారు నాని. ఏదైనా ఇనిస్టెంట్ గా చేసినప్పుడు బాగుంటుందని చెబుతున్నారు. హోమ్ వర్క్ చేస్తే ఎమోషన్ తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు.

"ఓ ఎమోషనల్ సీన్ ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించాలని, హోం వర్క్ చేయాలని చాలామంది నాతో చెబుతుంటారు. కానీ నిజాయితీగా చెప్పాలంటే ఓ సీన్ గురించి ఎక్కువ ఆలోచిస్తే, ఎమోషన్ మిస్ అయిపోతుంది. ఉదాహరణకు ఎవరికైనా జీవితంలో ఏదైనా చెడు జరిగితే, 2 రోజుల తర్వాత ఆ బాధ కొంత తగ్గిపోతుంది. మొదటి రోజు ఉన్నంత ప్రభావం కనిపించదు. కాబట్టి ఓ సీన్ గురించి అదే పనిగా ఆలోచిస్తే సరిగ్గా నటించలేం అనేది నా ఫీలింగ్. అలా చేసినప్పుడు నటన మెకానికల్ గా మారిపోతుంది."

ఇదే సందర్భంలో మెథడ్ యాక్టింగ్ పై కొన్ని కామెంట్స్ చేశారు నాని. కొంతమంది అదే పనిగా పాత్రలో ఉండిపోయామని చెబుతారని, అలా ఎలా సాధ్యమో తనకు అర్థంకాదన్నారు. యాక్షన్ అని చెప్పినప్పుడే నటించాలని, క్యారెక్టర్ లో రోజంతా ఎలా ఉండిపోతారని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటో తనకు తెలియదని, దాని గురించి ఇప్పటికీ తనకు అర్థంకాదని అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?