నాని – రెండు ఫ్యామిలీ స్టోరీలు

హీరో నాని ప్లానింగ్ భలేగా వుంది. వి అనే థ్రిల్లర్ చేస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ అనే డిఫరెంట్ మూవీ స్టార్ట్ కావాల్సి వుంది. ఈ రెండింటి మధ్యలో శివనిర్వాణ, వివేక్ ఆత్రేయ డైరక్షన్లలో…

హీరో నాని ప్లానింగ్ భలేగా వుంది. వి అనే థ్రిల్లర్ చేస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ అనే డిఫరెంట్ మూవీ స్టార్ట్ కావాల్సి వుంది. ఈ రెండింటి మధ్యలో శివనిర్వాణ, వివేక్ ఆత్రేయ డైరక్షన్లలో రెండు సినిమాలు వున్నాయి. ఈ రెండూ పక్కా ఫ్యామిలీ స్టోరీలే అని తెలుస్తోంది. ముఖ్యంగా టక్ జగదీష్ పక్కా ఉమ్మడి కుటుంబ వ్యవహారం.

తెలుగు టీవీ సీరియళ్లలో మాదిరిగా కుటుంబ రాజకీయాలతో అల్లుకున్న కథ అని తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే మణిరత్నం ఘర్షణ, నవాబ్ (తమిళంలో చెక్క  చివంత వానమ్ ) సినిమాల మాదిరిగా వుంటుందట. అన్నదమ్ములు, కుటుంబ ఆధిపత్యం, ఎత్తుగడలు, రాజకీయాలు లాంటి వ్యవహారాలు అన్నీ కలిసి టక్ జగదీష్ గా తయారవుతందని తెలుస్తోంది.

వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే పూర్తయిపోవాల్సిందే. కరోనా కారణంగా నలబై శాతం దగ్గర ఆగిపోయింది. వన్స్ లాక్ డౌన్ అయిపోయి షూటింగ్ లు ప్రారంభమైతే, నాని చకచకా ఫినిష్ చేసే సినిమా ఇదే. ఆ తరువాతే మరే సినిమా అయినా ప్రారంభం అయ్యేది.

సినిమా ప్లాప్ అయితే అంతే

కర్నూలు వైరస్ కథ