cloudfront

Advertisement


Home > Movies - Movie News

వెబ్ సైట్ పై విరుచుకుపడిన హీరోయిన్

వెబ్ సైట్ పై విరుచుకుపడిన హీరోయిన్

రాక్ స్టార్ సినిమాతో పేరుతెచ్చుకున్న నర్గీస్ ఫక్రి, ఓ వెబ్ సైట్ పై విరుచుకుపడింది. తనపై అవాస్తవాలు ప్రచురించిందనే కోపంతో ఆ వెబ్ సైట్ పై విమర్శలు చేస్తూ వరుసగా ట్వీట్స్ పెట్టింది. ఇంతకీ ఈమె కోపానికి కారణం ఏంటో తెలుసా..? నర్గీస్ గర్భవతి అంటూ సదరు వెబ్ సైట్ ఆర్టికల్ రాయడమే.

ఈమధ్య ఎక్కువగా వదులుగా ఉన్న దుస్తులు వేసుకుంటోంది నర్గీస్. ముందుకు వచ్చిన తన గర్భం నలుగురికీ కనిపించకూడదనే ఉద్దేశంతోనే నర్గీస్ ఇలా లూజ్ గా ఉండే దుస్తులు వేసుకుంటోందంటూ ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కథనం ప్రచురించింది. ఈ ఆర్టికల్ చదివిన నర్గీస్, ఆ వెబ్ సైట్ పై భగ్గుమంది. కథనంలో ప్రతి పదం అబద్ధమని, తెలుసుకొని నిజాలు రాయాలని సూచించింది.

39 ఏళ్ల నర్గిస్, ఓ ఫ్రెండ్ మోడల్ తో మొన్నటివరకు డేటింగ్ చేసింది. అతడి ద్వారానే ఆమె గర్భవతి అయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ మోడల్ తో ఇప్పుడామె కలిసి ఉండడంలేదు. ఈ నేపథ్యంలో ఆ కథనం రావడం, దానిపై నర్గీస్ అసహనం వ్యక్తంచేయడం చకచకా జరిగిపోయాయి.

రాక్ స్టార్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, బాలీవుడ్ లో ఇప్పటివరకు దాదాపు అరడజనుకు పైగా సినిమాలు చేసింది. కానీ రాక్ స్టార్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. కాకపోతే ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో పెట్టే స్టిల్స్, వివిధ మ్యాగజైన్లకు ఇచ్చే హాట్ హాట్ పోజులు నర్గీస్ ను లైమ్ లైట్లో ఉంచుతున్నాయి.

ఓవైపు ఇలా కెరీర్ లో ఇబ్బందులు పడుతున్న టైమ్ లో ప్రెగ్నెంట్ అంటూ కథనం వచ్చేసరికి నర్గీస్ తట్టుకోలేకపోయింది. తనకోపం, ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని సదరు వెబ్ సైట్ పై ట్వీట్స్ రూపంలో చూపించేసింది. అదీ సంగతి.

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?