cloudfront

Advertisement


Home > Movies - Movie News

@నర్తనశాల చిత్రానికి హిజ్రాల ఎఫెక్ట్

@నర్తనశాల చిత్రానికి హిజ్రాల ఎఫెక్ట్

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న @నర్తనశాల చిత్రానికి హిజ్రాల ఎఫెక్ట్ పడింది. నర్తనశాల అంటేనే బృహన్నల లాంటి చిత్రమని తెలుస్తూనే ఉంది దానికి తోడు హీరో నాగశౌర్య మీడియాతో మాట్లాడుతూ @నర్తనశాల చిత్రంలో గే క్యారెక్టర్ చేశానని చెప్పడంతో ఈ విషయం గురించి కొంతమంది హిజ్రాలకు ఉప్పందండంతో ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆందోళన చేపట్టారు. మా మనోభావాలను కించపరిచేలా @నర్తనశాల చిత్రం ఉందని , మాకు వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాలను తక్షణమే తొలగించాలని , లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా @నర్తనశాల ప్రదర్శిస్తున్న థియేటర్ ల ముందు ఆందోళన చేస్తామని అలాగే సినిమా ప్రదర్శించకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. 

హిజ్రాలు ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆందోళన చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మించగా శ్రీనివాస చక్రవర్తి ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాగా ఈనెల 30న @నర్తనశాల చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నాగశౌర్య సరసన కాశ్మీర పరదేశి , యామిని భాస్కర్ లు నటించారు. హిజ్రాలు ఆందోళన చేయడం @నర్తనశాల కు కలిసి వస్తుందా చూడాలి ఎందుకంటే ఎంత వివాదం సృష్టిస్తే అంతటి వసూళ్లు వస్తాయని తేలిగ్గా తీసుకుంటున్నారు @నర్తనశాల  చిత్ర బృందం.