cloudfront

Advertisement


Home > Movies - Movie News

నాటకం.. మళ్లీ మరో నాటు రొమాన్స్

నాటకం.. మళ్లీ మరో నాటు రొమాన్స్

మన టాలీవుడ్ జనాలకు ఎవరో ఒకరు చిన్నదారి చూపించాలి. ఇక అదే పోకపోతారు. మారుతి ఈ రోజుల్లో, బస్ స్టాప్ తీస్తే, ఇక అదే దోవలో డజన్ల కొద్దీ సినిమాలు వచ్చాయి. పచ్చి బూతులు, బ్లూ సీన్లతో సినిమాల నింపేసి వదిలారు. వాటిలో నూటికి తొంభై తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసాయి. ఆ తరువాత ఆ టైపు సినిమాలు ఆగిపోయాయి.

ఇప్పడు మళ్లీ అలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. ఆర్ ఎక్స్ 100 సినిమా హిట్ అయిపోవడంతో, మోటు, నాటు సరసాలు, ప్రేమలు తెరపైకి వరదలా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే భైరవ గీత అనే సినిమా టీజర్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా నాటకం అనే సినిమా ట్రయిలర్ వచ్చింది.

ఇది కూడా అచ్చంగా ఆర్ ఎక్స్ 100 స్టయిల్ లోనే వుంది. నోట్లో నోరు పెట్టి జుర్రేయడం ట్రయిలర్ లో చూసినవారు, సినిమాకు నాటకం అనే పేరు బదలు నాకటం అని పెట్టాల్సింది అని జోకులేస్తున్నారు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వంలో ఆశిష్‌ గాంధీ, ఆషిమా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న నాటకం సినిమాను శ్రీసాయి దీప్‌ చాట్ల, రాధిక శ్రీనివాస్‌, ప్రవీణ్‌ గాంధీ, ఉమ కూచిపూడి నిర్మిస్తున్నారు.