cloudfront

Advertisement


Home > Movies - Movie News

ప్రియుడితో దీపావళి.. మళ్లీ హాట్ టాపిక్

ప్రియుడితో దీపావళి.. మళ్లీ హాట్ టాపిక్

సడెన్ గా చూస్తే ఒక్కోసారి వీళ్లిద్దరికీ పెళ్లయిపోయిందేమో, భార్యాభర్తలేమో అనే అనుమానం కలుగుతుంది. అంతలా కలిసిపోయారు నయనతార, విఘ్నేష్ శివన్. ఏకాంతంగా గడిపేందుకు అప్పట్లో విదేశాలకు వెళ్లిపోయే ఈ జంట, ఇప్పుడు చెన్నైలోనే ఎప్పుడుపడితే అప్పుడు కలుసుకుంటున్నారు. రీసెంట్ గా నిన్న కూడా వీళ్లిద్దరూ కలిసి హంగామా చేశారు.

దీపావళి సందర్భంగా కోలీవుడ్ కు చెందిన కొందరు కలిసి పార్టీ చేసుకున్నారు. వీళ్లలో నయన్, విఘ్నేష్ తో పాటు హీరో శివ కార్తికేయన్, మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్, డైరక్టర్ అట్లీ తదితరులున్నారు. దాదాపు 15 మంది కలిసి పార్టీ చేసుకుంటే అందులో నయన్-విఘ్నేష్ మాత్రమే హైలెట్ అయ్యారు. వీళ్ల ఫొటోలు మాత్రమే వైరల్ అయ్యాయి.

పార్టీ పూర్తయ్యేంతవరకు నయన్ ను విఘ్నేష్ విడిచిపెట్టలేదు. విఘ్నేష్ ను కూడా నయన్ వదల్లేదు. ఇద్దరూ కలిసే ఎంజాయ్ చేశారు. చివరికి కలిసే భోజనం కూడా చేశారు. ఇలా పండగలకు వీళ్లిద్దరూ కలవడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో ఓనమ్ పండగ సందర్భంగా ఏకంగా తన ఇంటికే విఘ్నేష్ ను ఆహ్వానించింది నయనతార.

అప్పుడే వీళ్లిద్దరి బంధానికి కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక అప్పట్నుంచి విదేశం, స్వదేశం అనే తేడాలేకుండా తీరిక వేళల్లో ఈ జంట హల్ చల్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా అమెరికా కూడా వెళ్లొచ్చారు వీళ్లిద్దరూ. ఇప్పటికే వీళ్లిద్దరి బంధం కోలీవుడ్ లో ఓపెన్ సీక్రెట్ గా మారింది. ఇక పెళ్లి చేసుకుంటే బెటరేమో. ఆ ముహూర్తం ఎప్పుడో!

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్