Advertisement

Advertisement


Home > Movies - Movie News

బర్త్ డే.. బాయ్ ఫ్రెండ్ తో యూఎస్ లో హీరోయిన్!

బర్త్ డే.. బాయ్ ఫ్రెండ్ తో యూఎస్ లో హీరోయిన్!

తమ సరదా సమయాన్ని జంటగా గడుపుతూ, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బహిరంగ పరుచుకుంటూ ఉన్నారు నయనతార-విఘ్నేష్  శివన్. ఇది వరకూ బోలెడన్ని సందర్భాల్లో వీరిద్దరూ సెల్ఫీలను పోస్టు చేశారు. తమ బంధాన్ని అలా చాటుకున్నారు.

ఇటీవలే విఘ్నేశ్ శివన్ బర్త్ డేను నయనతార గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు నయనతార పుట్టిన రోజు  వంతు వచ్చింది. ఈ రోజు నయనతార పుట్టిన రోజు. ఇప్పటికే ఈ జంట అమెరికాకు చేరుకుంది. అక్కడ జంటగా విహరిస్తూ ఉంది.

వీరిద్దరూ యూఎస్ లో జంటగా తిరుగుతూ  దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేశాడు విఘ్నేష్. ఆమెతో ఉండటంలో తన ఆనందాన్ని ఈ దర్శకుడు ఆ పోస్టుల్లో వివరించాడు. ఇలా సరదాగా, ప్రేమగా సాగిపోతూ ఉంది ఈ జంట. బై ది వే..హ్యాపీ బర్త్ డే నయనతార! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?