cloudfront

Advertisement


Home > Movies - Movie News

తెలుగు దర్శకుడి మలయాళీ సినిమా!

తెలుగు దర్శకుడి మలయాళీ సినిమా!

నీలకంఠకు దర్శకుడిగా తెలుగునాట రావాల్సినంత గుర్తింపు రాలేదు. అదెందుకో మరి. షో, మిస్సమ్మ, సదా మీ సేవలో, నందనవనం 120 కిలోమీటర్స్, మిస్టర్ మేధావి... వంటి సినిమాలను ఏ బాలీవుడ్ దర్శకుడో, మరో తమిళ దర్శకుడో రూపొందించి ఉంటే.. మనోళ్లు అతడిని నెత్తిన పెట్టుకునే వాళ్లు. 

అతడికి ఫ్యాన్స్ అని చెప్పుకోవడం సినీ ప్రేక్షకులకూ గొప్ప అర్హత అయ్యేది. ఇప్పటి తెలుగు యంగ్ డైరెక్టర్స్ గొప్ప సినిమాలు తీస్తున్నారని చాలామంది అంటూ ఉంటారు. ఈ సినిమాలతో పోలిస్తే.. నీలకంఠ సినిమాలు కచ్చితంగా ఒక మెట్టుపైనే ఉంటాయి. 

కమర్షియల్ పంథాకు విరుద్ధంగా, అదే సమయంలో ఎంటర్ టైన్ మెంట్ మిస్ కాకుండా సినిమాలు తీశాడు నీలకంఠ. ఆయన ఇప్పుడు ఒక రీమక్ సినిమా చేస్తున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమా రీమేక్ ను నీలకంఠ రూపొందిస్తున్నాడు. అయితే అది మలయాళీల కోసం.

‘జామ్ జామ్’ ఆ సినిమా పేరు. మంజిమా మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలతో పాటు క్వీన్ మలయాళీ రీమేక్ కూడా రూపొందుతోంది. ఈనెల ఇరవై ఒకటో తేదీన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాబోతోంది. మరి ఈ తెలుగు దర్శకుడు మలయాళంలో హిట్ కొడతాడేమో చూడాలి. 

సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్ 

పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్