cloudfront

Advertisement


Home > Movies - Movie News

నిజమే.. నా భార్య పెళ్లికి ముందే గర్భవతి

నిజమే.. నా భార్య పెళ్లికి ముందే గర్భవతి

పెళ్లికి ముందు డేటింగ్ పేరిట ఓ రేంజ్ లో తిరిగారు హీరోయిన్ నేహాధూపియా, నటుడు అంగద్ బేడీ. అర్థరాత్రిళ్ల వరకు పబ్ లో వినోదాలు, ఆ తర్వాత బెడ్ రూమ్ లో కబుర్లతో తెగ కాలక్షేపం చేశారు. అయితే సడెన్ గా ఓ రోజు ఈ జంట పెళ్లి చేసుకుంది.

ఏమాత్రం చడీచప్పుడు లేకుండా, నిరాడంబరంగా ఓవర్ నైట్ పెళ్లి చేసుకున్నారు. ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అప్పట్లో మీడియా చాలా కథనాలు వెలువరించింది. ఎట్టకేలకు ఆ మేటర్ పై స్పందించాడు నటుడు అంగద్ బేడీ.

ఓ టీవీ షోలో పాల్గొన్న అంగద్ బేడీ, నేహాతో సీక్రెట్ మ్యారేజ్ పై స్పందించాడు. నేహా పెళ్లికి ముందే తన ద్వారా గర్భవతి అయిందని, ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసి పెద్ద రచ్చ అయిందని వెల్లడించాడు. అందుకే ఆఘమేఘాల మీద పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ప్రకటించాడు.

మే 10న వీళ్లిద్దరూ రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. అప్పటికే నేహా ధూపియా గర్భవతి. కానీ ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికి నేహా చేతిలో ఓ సినిమా ఆఫర్ ఉంది. నేహా ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఎక్కడ ఆ సినిమా నుంచి ఆమెను తీసేస్తారో అని భయపడి అప్పట్లో ఆ విషయాన్ని బయటకు చెప్పలేదంటున్నాడు అంగద్. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది నేహా ధూపియా.

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్