Advertisement


Home > Movies - Movie News
నేలటిక్కెట్టు ఫ్లాప్.. బంగార్రాజు పరిస్థితేంటో..?

నేలటిక్కెట్టు అట్టర్ ఫ్లాప్ అయింది. రవితేజ కెరీర్ లో రీసెంట్ గా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన టచ్ చూసి చూడు సినిమాను ఇది క్రాస్ చేసేలా ఉంది. ఇలాంటి ఫ్లాప్ మూవీని తెరకెక్కించిన దర్శకుడికి నాగార్జున మళ్లీ అవకాశం ఇస్తాడా అనేది అక్కినేని అభిమానుల ప్రశ్న.

గతంలో నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా లాంటి హిట్ సినిమా తీశాడు కల్యాణ్ కృష్ణ. ఆ సినిమాలోని బంగార్రాజు పాత్రతో ఫుల్ లెంగ్త్ మూవీ ఇంకోటి ప్లాన్ చేశాడు. కానీ ఆ లైన్ నాగార్జునకు నచ్చలేదు. అలా అక్కినేని కాంపౌండ్ నుంచి బయటకొచ్చి రవితేజతో నేలటిక్కెట్టు తీసి ఫ్లాప్ కొట్టాడు కల్యాణ్ కృష్ణ.

అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ దర్శకుడు, రీసెంట్ గా బంగార్రాజు కథతో నాగార్జునను ఇంప్రెస్ చేశానని ప్రకటించాడు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే తన నెక్ట్స్ సినిమా నాగ్ తోనే అంటున్నాడు. మరి నేలటిక్కెట్టు ఫ్లాప్ తర్వాత నాగ్, కల్యాణ్ కృష్ణకు అంత ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.

మరోవైపు ఇలాంటి సెంటిమెంట్స్ ను నాగార్జున పట్టించుకోడనే విషయం అందరికీ తెలిసిందే. నిజంగా ఇలాంటివి పట్టించుకుంటే వర్మను అస్సలు దగ్గరకు రానిచ్చేవాడా..? అంతేకాదు.. వరుస ఫ్లాపులిస్తున్న పూరి జగన్నాధ్ తో కూడా చర్చలు జరుపుతున్నాడట నాగ్. ఈ లెక్కన చూసుకుంటే నేలటిక్కెట్టు ఫ్లాప్ ఎఫెక్ట్ కల్యాణ్ కృష్ణపై ఉండదేమో.