Advertisement

Advertisement


Home > Movies - Movie News

న‌టి మ‌ల్లికా మొహం ప‌గిలేలా నెటిజ‌న్ కామెంట్‌

న‌టి మ‌ల్లికా మొహం ప‌గిలేలా నెటిజ‌న్ కామెంట్‌

వ్య‌క్తిగ‌త నిజాయితీ లేన‌ప్పుడు అందుకు త‌గ్గ‌ట్టుగా న‌డుచుకుంటే ఏ స‌మ‌స్యా రాదు. కానీ ఆచ‌ర‌ణ‌కు, మాట‌ల‌కు న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్నంత‌గా తేడా క‌నిపిస్తే మాత్రం జ‌నం ఊరుకోరు. అస‌లే ఇప్పుడు సోష‌ల్ మీడియా యుగం. నీతులు మాట్లాడే వాళ్ల వ్య‌క్తిగ‌త ఆచ‌ర‌ణ ఏపాటిదో అని క‌ళ్ల‌ప్ప‌గించి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ ఉంటారు. ఏ మాత్రం తేడా క‌నిపించినా వెంట‌నే సోష‌ల్ మీడియా వేదిక‌గా నిగ్గ‌దీసి అడుగుతారు.

ఇలాంటిదే న‌టి మ‌ల్లికా శెరావ‌త్ విష‌యంలో ఎదురైంది. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హాథ్ర‌స్ అత్యాచార ఘ‌ట‌న‌పై మ‌ల్లికా స్పందిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ఏంటంటే... ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానాల్లో మార్పులు వ‌చ్చేలా సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టిన‌ప్పుడే దేశంలో ఇలాంటి అఘాయిత్యాలు ఆగిపోతాయ‌ని ట్వీట్ చేశారు. అత్యాచార ఘ‌ట‌న‌పై బాధ్య‌తాయుతంగా మ‌ల్లికా స్పందించినందుకు అభినందించాల్సిందే.

అయితే సినీ సెల‌బ్రిటీ అయిన మ‌ల్లికా ట్వీట్‌ను నెటిజ‌న్లు చూసే దృష్టి త‌ప్ప‌కుండా విభిన్నంగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో మ‌ల్లికా ట్వీట్‌పై ఓ నెటిజ‌న్ స్పందిస్తూ ... మీరు న‌టించే సినిమాలు కూడా స‌మాజాన్ని ప్ర‌భావితం చేస్తాయి. సూక్తులు చెప్పే ముందు, మ‌నం మారాలి. ఆ త‌ర్వాతే బ‌య‌ట వాళ్ల‌కి నీతులు చెప్పాలంటూ ఘాటుగా హిత‌వు చెబుతూ కామెంట్ పెట్టాడు.

నెటిజ‌న్ కామెంట్‌కు మ‌ల్లికా శెరావ‌త్ ఇబ్బందికి గురైంది. త‌న వ‌ద్ద స‌మాధానం లేక‌పోవ‌డంతో ఇబ్బంది ఉంటే సినిమాలు చూడొద్ద‌ని స‌మాధానం ఇచ్చారు. అలాగే స్క్రీన్‌పై తాను పోషించే పాత్ర‌ల‌కు, వ్య‌క్తిగ‌త జీవితానికి ఎంతో తేడా ఉంటుంద‌ని ఆమె స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌చ్చింది.   

వైయస్సార్ దగ్గర చంద్రబాబు డబ్బులు తీసుకునేవాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?