cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

నెటిజ‌న్లు అపార్థం చేసుకున్నారుః బ్యూటీ

నెటిజ‌న్లు అపార్థం చేసుకున్నారుః బ్యూటీ

నెటిజ‌న్లు త‌న‌ను అపార్థం చేసుకున్నార‌ని బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుంద‌రి కూతురైన జాన్వీకపూర్ అంటున్నారు. ఈ మేర‌కు ఆమె సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఇటీవ‌ల జాన్వీక‌పూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలు చేశారు. 

దేశ‌మంతా క‌రోనాతో వ‌ణికిపోతుంటే, అంద‌చందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇదా స‌మ‌యం అని జాన్వీని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇది బాధ్య‌తా రాహిత్యం అని నెటిజ‌న్లు దుమ్మెత్తి పోశారు.

ఇలాంటి ఫొటోలు పెట్ట‌డానికి కాస్తైనా ఆలోచించ‌రా అంటూ జాన్వీని నిల‌దీశారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేంత వ‌ర‌కూ అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న ఆప‌లేరా అంటూ బాగానే ఎటాక్ చేశారు. ఈ నేప‌థ్యంలో జాన్వీక‌పూర్ తాజాగా వివ‌ర‌ణ ఇచ్చారు.

వాస్త‌వాలు తెలుసుకోకుండా త‌న‌పై ట్రోల్ చేశార‌ని వాపోయారు. స‌ద‌రు హాట్ ఫొటోలు ...లాక్‌డౌన్‌ ముందు ఓ మాస పత్రిక కవర్ పేజీ కోసం చేసిన ఫొటోషూట్‌ తాలూకు స్టిల్స్ అని చెప్పుకొచ్చారు. 

ఇవేవీ తెలియ‌ని నెటిజ‌న్లు తనను అపార్థం చేసుకున్నారని వాపోయారు. తనకు సామాజిక బాధ్యత గురించి బాగా తెలుసునన్నారు. కరోనా మహమ్మారి నుంచి దేశం కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×