cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

కోట్లు పెట్టి.. సెల‌బ్రిటీలు పోటీ ప‌డి కొంటున్న కారు ఇది!

కోట్లు పెట్టి.. సెల‌బ్రిటీలు పోటీ ప‌డి కొంటున్న కారు ఇది!

మెర్సిడెస్- మైబాహ్ జీఎల్ఎస్-600(Mercedes Maybach GLS 600), ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో బాగా అమ్ముడ‌వుతున్న ల‌గ్జ‌రియ‌స్ ఎస్ యూవీ. అత్యంత లగ్జ‌రియ‌స్ ఎస్ యూవీగా పేరు తెచ్చుకుంది ఈ వాహ‌నం. ఈ జ‌ర్మ‌న్ కార్ ఇప్పుడు సెల‌బ్రిటీల‌ను బాగా ఆక‌ర్షిస్తూ ఉంది. 

ఒక‌రి త‌ర్వాత ఒక‌రిగా బాలీవుడ్ సెల‌బ్రిటీలు దీన్ని పోటీ ప‌డి కొంటున్నారు. తాజాగా న‌టి  కృతి స‌న‌న్ దీన్ని కొనుగోలు చేసింది. చేతినిండా ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉన్న కృతి ఈ కారు కొనుగోలుతో ఒక ఎలైట్ క్ల‌బ్ లోనే చేరిన‌ట్టు అయ్యింది.

గ‌త కొన్ని నెల‌ల్లో ప‌లువురు బాలీవుడ్ సెలెబ్స్ ఈ కారును కొనుగోలు చేశారు.  వారిలో ర‌ణ్ వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ క‌పూర్ త‌దిత‌రులున్నారు. వారంద‌రి త‌ర్వాత కృతి ఈ కారును కొనుగోలు చేసింది.

దీని ధ‌ర సుమారు 2.43 కోట్ల రూపాయ‌లు. ఇది భారీ ధ‌రేన‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ల‌గ్జ‌రియ‌స్ ఎస్యూవీ ఇన్ ద వ‌రల్డ్ గా పేరు పొందిన ఈ వాహ‌నాన్ని ఇలా సెల‌బ్రిటీలు పోటీ ప‌డి మ‌రీ కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఈ జ‌ర్మ‌న్ కారు ఇలా మ‌నోళ్ల మ‌న‌సుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ట్టుగా ఉంది.

ఇలా సెల‌బ్రిటీలు వ‌ర‌స పెట్టి కొంటున్న నేప‌థ్యంలో.. మిగ‌తా సినీతార‌లు, ధ‌నికులు కూడా ఈ ఎస్యూవీ ప‌ట్ల ఒక లుక్ వేసే అవ‌కాశాలు లేక‌పోలేదు.

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×