cloudfront

Advertisement


Home > Movies - Movie News

సరికొత్త కల్యాణ్ రామ్ ను చూడండి

సరికొత్త కల్యాణ్ రామ్ ను చూడండి

నా నువ్వే సినిమాలో కల్యాణ్ రామ్ ఎలా ఉండబోతున్నాడనే విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీ ఉంది ప్రేక్షకులకి. ఎందుకంటే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు పలు స్టిల్స్ కూడా రిలీజయ్యాయి. ఇప్పుడా సినిమాకు సంబంధించి ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ లో కూడా  కల్యాణ్ రామ్ మేకోవరే ఎట్రాక్ట్ చేసింది. 

కెరీర్ లో ఇప్పటివరకు కనిపించని విధంగా లవర్ బాయ్ గా మారిపోయాడు కల్యాణ్ రామ్. ట్రిమ్ చేసిన గడ్డం, మీసంతో చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. అయితే సినిమాలో కల్యామ్ రామ్ ను ఈ మేకోవర్ వరకే పరిమితం చేసినట్టు కనిపిస్తోంది. నా నువ్వేలో కల్యాణ్ రామ్ కంటే తమన్నాకే ఎక్కువ స్కోప్ ఇచ్చినట్టు ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. 

జయేంద్ర రాసుకున్న ఈ డిఫరెంట్ స్టోరీలో వన్ సైడ్ లవ్ యాంగిల్ కనిపిస్తోంది. తమన్న ప్రేమిస్తుంది.. క్లయిమాక్స్ లో ఆ ప్రేమను కల్యాణ్ రామ్ గుర్తిస్తాడు. మధ్యలో వచ్చే ట్విస్టులతో నా నువ్వే సినిమా తెరకెక్కింది. కంప్లీట్ లవ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన నా నువ్వే ట్రయిలర్ లో పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్ గా నిలిచింది. విజువల్స్ అన్నీ క్లాసీగా కనిపిస్తున్నాయి. 

ఓవరాల్ గా నా నువ్వే ట్రయిలర్ చూడ్డానికి కొత్తగా ఉంది. థియేటర్లలో సినిమా ఇంకెంత కొత్తగా ఉంటుందో చూడాలి. వచ్చేనెల ఈ సినిమా రిలీజ్ అవుతుంది.