cloudfront

Advertisement


Home > Movies - Movie News

పెద్ద హీరోలతో చేయకపోవడానికి కారణం అదే

పెద్ద హీరోలతో చేయకపోవడానికి కారణం అదే

మనసులో మాట బయటపెట్టింది కొణెదల నిహారిక. పెద్ద హీరోల సరసన చేయడం పెద్ద సమస్యకాదని, కానీ తను కొన్నేళ్లు మాత్రమే సినిమాలు చేస్తానని, ఈ కొన్ని సినిమాలు తన మనసుకు నచ్చినట్టు చేస్తున్నానని స్పష్టంచేసింది. ఆ తర్వాత ఎలాగూ ఇంట్లో పెళ్లి చేసేస్తారని అంటోంది.

"అప్పట్లో హీరోయిన్లలా నాకు 10-15 ఏళ్లు ఇండస్ట్రీలో ఉండిపోవాలని లేదు. నా పరిమితులు నాకు ఉన్నాయి. 30లోపు పెళ్లి చేసేస్తాం అన్నారు. నాకు చాలా తక్కువ టైమ్ ఉంది. కాబట్టి నా మనసుకు నచ్చిన సినిమాలు నేను చేసుకుంటాను. పెద్ద హీరోల సినిమాల్లోనే చేయాలని కూర్చుంటే వర్కవుట్ అవ్వదు. పెద్ద హీరోల సినిమాల్లో చేయడం సమస్యకాదు, కానీ నాకున్న టైమ్ లో నా మనసుకు నచ్చిన సినిమాలు చేస్తున్నా."

సో.. 30 తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాననే విషయంపై నిహారిక కూడా చాలా క్లారిటీతో ఉందన్నమాట. అందుకే ఇలా తన మనసుకు నచ్చిన సినిమాలు చేస్తోంది. అయినా అందరికంటే పెద్ద హీరోతో నటిస్తున్నప్పుడు ఇక మిగతా పెద్ద హీరోలతో నటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది నిహారిక.

"నిజంగా చెబుతున్నా, పెద్ద హీరోల సినిమాలేవీ ఇప్పటివరకు నా దగ్గరకు రాలేదు. నేనేంటో, నేనెలాంటి సినిమాలు చేస్తానో వాళ్లకు కూడా తెలుసు. అయితే ఒకే ఒక్క పెద్ద హీరోతో నటించాలనే డ్రీమ్ ఉంది. అది చిరంజీవి గారితో. ఇప్పుడు ఆయన సినిమా సైరాలో చేస్తున్నాను. నాకది చాలు. అంతకంటే ఇంకేంకావాలి".

కెరీర్ లో ఇప్పటివరకు బ్రేక్ అందుకోలేకపోయింది నిహారిక. తాజాగా సూర్యకాంతం సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ నెలాఖరుకు ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

రాధాకృష్ణ నాతో పెట్టుకోకు నేను ఎదవని కాదు...

సురేఖ వద్ద పవన్ పర్సనల్ లోన్.. కోటి ఏడు లక్షలకు పైగా..