cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

గంటల్లోనే మాటమార్చిన నిఖిల్

గంటల్లోనే మాటమార్చిన నిఖిల్

తను దర్శకుడిగా మారబోతున్న విషయాన్ని గ్రాండ్ గా ప్రకటించాడు నిఖిల్. ఈ లాక్ డౌన్ టైమ్ లో మెగా ఫోన్ పట్టుకోబోతున్నానని, చిన్నారులతో ఓ ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు. అయితే ఇలా చెప్పిన గంటల్లోనే ఈ హీరో మాట మార్చాడు.

"ఓ చిల్డన్స్ ఫిలిం కోసం మేమంతా కలిసి ఓ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాం. అయితే నేను డైరక్ట్ చేయబోవడం లేదు. ఎందుకంటే అక్టోబర్-నవంబర్ నుంచి నా రెండు సినిమాలు హెవీ షెడ్యూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. త్వరలోనే థియేటర్లలో కలుద్దాం."

ఇలా తను దర్శకత్వం వహించడం లేదనే విషయాన్ని స్వయంగా ప్రకటించాడు నిఖిల్. నిజానికి ఆడియన్స్ కూడా ఇదే అనుమానం వ్యక్తంచేశారు. ఉన్నఫలంగా నిఖిల్ దర్శకుడిగా మారితే.. అతడు ఆల్రెడీ ఒప్పుకున్న 18-పేజెస్, కార్తికేయ-2 సినిమాలు మరింత లేట్ అవుతాయని డౌట్ పడ్డారు.

అందరి అనుమానాల్ని నివృత్తి చేస్తూ ఇప్పట్లో తను దర్శకత్వం వహించనని స్పష్టంచేశాడు నిఖిల్. అయితే తను తీయబోయే చిల్డ్రన్స్ ఫిలిమ్ మాత్రం చాలా కొత్తగా, ప్రయోగాత్మకంగా ఉంటుందంటున్నాడు ఈ హీరో. ఈ చిన్నపిల్లల కథలో నిఖిల్ కు అంతగా ఏం నచ్చిందనేది ఆసక్తికరంగా మారింది.

నాగ‌బాబూ ...మ‌రీ ఇంత దిగ‌జారుడేంది?

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

 


×