
ప్రేమమ్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి హీరో నిఖిల్ సరసన నటించబోతోంది. ఇప్పటికే ఈ ఇద్దరు కలిసి 18 పేజెస్ అనే సినిమాను గీతా ఆర్ట్స్ లో చేస్తున్నారు.
నిఖల్ మరో సినిమా కార్తికేయ 2 కూడా అనుపమనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఈ నెల 26 నుంచి కార్తికేయ 2 సినిమా షూట్ ప్రారంభం కాబోతోంది.
సవ్యసాచి సినిమా తరువాత ఈ సబ్జెక్ట్ నే పట్టుకుని కూర్చున్నాడు దర్శకుడు చందు మొండేటి. ఇది తీసిన తరువాతే మరేదైనా అని పట్టుదలగా వుండి ఆఖరికి ఇప్పుడు సెట్ మీదకు తీసుకెళ్తున్నాడు.
పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించే ఈ సినిమాకు చాలా సిజి వర్క్ వుంది. మినియేచర్ ప్రాపర్టీస్ కావాలి. ఇవన్నీ లాక్ డౌన్ టైమ్ లో చేయించేసారు.
ఇప్పుడు డైరక్ట్ గా షూట్ కు వెళ్తున్నారు. సినిమా ఆరంభంలోనే అనుపమ పేరు వినిపించింది. కానీ తరువాత మశ్లీ వేరే ఆలోచనలు చేసారు. కానీ ఆఖరికి అనుపమ పేరే ఫైనల్ అయింది.