నిర్మాణ భాగస్వామిగా త్రివిక్రమ్

టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణ భాగస్వామిగా మారుతున్నారు. ఇప్పటికే టాప్ డైరక్టర్లు సుకుమార్, కొరటాల తమ తమ బ్యానర్లు స్టార్ట్ చేసారు. మారుతి కి బ్యానర్ వుంది. ఇంకా చాలా మంది డైరక్టర్లు…

టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణ భాగస్వామిగా మారుతున్నారు. ఇప్పటికే టాప్ డైరక్టర్లు సుకుమార్, కొరటాల తమ తమ బ్యానర్లు స్టార్ట్ చేసారు. మారుతి కి బ్యానర్ వుంది. ఇంకా చాలా మంది డైరక్టర్లు అధికారికంగా, అనఫీషియల్ గా నిర్మాణాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ వంతు వచ్చింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఆయన సినిమాలు నిర్మించబోతున్నారు. కేవలం సమర్పకుడిగా మాత్రమే కాదు. నిర్మాతగా కూడా. అయితే నిర్మాతగా ఆయన పేరు వుండదు. ఆయన సతీమణి పేరు వుంటుంది. తొలిసినిమాగా నవీన్ పోలిశెట్టి హీరోగా సినిమా ప్రకటించబోతున్నారు.

జాతిరత్నాలు సినిమాతో ఇటీవల అతి పెద్ద కమర్షియల్ హిట్ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి ఓ సినిమా సితార సంస్థకు ఓకె చేసారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్  తో పాటు త్రివిక్రమ్ స్వంత  బ్యానర్ ఫార్ట్యూన్ ఫోర్ కూడా పాలు పంచుకుంటుంది. 

రాజమండ్రి అవుట్ స్కర్ట్స్ లో ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే పేరుతో ఆయనకు థియేటర్ వుంది. అదే పేరును ఇప్పుడు బ్యానర్ గా మార్చారు.

మొత్తం మీద దర్శకుడిగా, ఎగ్జిబిటర్ గా, నిర్మాతగా 'త్రి'విక్రముడు అనిపించుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ 'గురూజీ'