cloudfront

Advertisement


Home > Movies - Movie News

పదినెలల తరువాత.. నితిన్

పదినెలల తరువాత.. నితిన్

15 ఏళ్ల ప్రయాణంలో హిట్ లు ఫ్లాపులు అన్నీ చూసాడు హీరో నితిన్. కానీ ఎప్పుడూ గ్యాప్ తీసుకోలేదు. కానీ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు నిరాశ పరిచిన తరువాత ఇక స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలని డిసైడ్ అయిపోయాడు. సుమారు 10 నెలలకు ఫైగా అలా ఖాళీగానే వున్నాడు. డైరక్టర్ వెంకీ కుడుమల రెడీ, బ్యానర్ రెడీ కానీ, వాళ్లంతట వాళ్లు పూర్తిగా పూల్ ప్రూఫ్ గా స్క్రిప్ట్ రెడీ అనేవరకు తాను ఓకె అనలేదు.

ఆఖరికి స్క్రిప్ట్ రెడీ అయింది. సెట్ మీదకు వస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో నితిన్-రష్మిక మడొన్న నటించే సినిమాకు ఈ బుధవారం (12)న శ్రీకారం చుడుతున్నారు. పైకి ప్రకటించడం లేదు కానీ ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలని యూనిట్ టార్గెట్ పెట్టేసుకుంది. ఆ విధంగా విడుదల చేస్తే 2019లో నితిన్ కు సినిమా లేదు, ఛలో లాంటి హిట్ ఇచ్చిన తరువాత వెంకీకి కూడా 2019లో సినిమా లేదు అనేమాట రాదు కూడా.

ఈ సినిమాలో తనవంతు వర్క్ అయిపోగానే వెంకీ అట్లూరి-కీర్తి సురేష్ కాంబినేషన్ లో అదే బ్యానర్ లో మరో సినిమా స్టార్ట్ చేసి 2020 సమ్మర్ కు విడుదల అయ్యేదిశగా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు నితిన్.

వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్