Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాకు ఇలాంటి కథలు కావాలంటున్న హీరో

నాకు ఇలాంటి కథలు కావాలంటున్న హీరో

ప్రతి హీరో కొన్ని కథల కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆ టైంలో వచ్చిన కథ వెంటనే ఓకే అయిపోతుంది. నితిన్ కూడా అలాంటి ఒక కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. తనకు ఎలాంటి కథలు కావాలో చెప్తున్నాడు ఈ హీరో.

మాస్ట్రో లాంటి డిఫరెంట్ స్టోరీస్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ హీరో. ఇక నితిన్ కెరీర్ లో ఒకే ఒక్క భక్తిరస చిత్రం శ్రీ ఆంజనేయం. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆ జానార్ లో మూవీ ట్రై చేయలేదు. ఎవరైనా ఒక మంచి డివోషనల్ కాన్సెప్ట్ తో వస్తే సినిమా చేయడానికి రెడీ అని చెప్తున్నారు. స్వతహాగా నితిన్ కు కాస్త దైవభక్తి ఎక్కువ. అందుకే డివోషనల్ మూవీస్ చేయాలనుకుంటున్నారు. 

ఇక నితిన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. వీటిలో వేణు శ్రీరామ్ సినిమాకు తమ్ముడు అని టైటిల్ పెట్టారు. ఇకపై ఈ రెండు సినిమాలను సైమల్టేనియస్ గా పూర్తి చేస్తానని ప్రకటించారు.

ఈ సందర్భంగా తన గత చిత్రం మాచర్ల నియోజకవర్గంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నితిన్. ఈ ఎలక్షన్ టైం లో ఆ సినిమా వచ్చి ఉంటే పెద్ద హిట్టయ్యేదనే కామెంట్స్ ను ఖండించారు. ఈ ఎలక్షన్ టైం లో వచ్చిన ఫ్లాప్ అయ్యేదాని చెప్పుకొచ్చారు ఫ్లాప్ అయ్యేది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?