cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఈ వీకెండ్ ఖాళీ.. ఎన్నో కారణాలు!

ఈ వీకెండ్ ఖాళీ.. ఎన్నో కారణాలు!

సమ్మర్ సీజన్ లో శుక్రవారం దొరకడమే చాలాకష్టం. దాదాపు 3నెలల కిందటే ఈ సమ్మర్ బాక్సాఫీస్ ను కబ్జా చేశాయి చాలా సినిమాలు. ఏమాత్రం గ్యాప్ దొరికినా తమ సినిమాను రిలీజ్ చేసేందుకు చాలామంది నిర్మాతలు వెయిటింగ్. ఇలాంటి టఫ్ కాంపిటిషన్ మధ్య కూడా ఈ శుక్రవారం ఖాళీ అయింది. పెద్ద సినిమాలేవీ ఈ వీకెండ్ రావడంలేదు.

మహానటి సూపర్ సక్సెస్ అయింది. ఏపీ, నైజాంలో అక్కడక్కడ మిగిలిన థియేటర్లన్నింటినీ ఈ సినిమాకే కేటాయిస్తున్నారు. దీనికి తోడు నా పేరు సూర్య, మెహబూబాకు కేటాయించిన స్క్రీన్లలో కొన్నింటిని ఈ వీకెండ్ నాటికి మహానటికి సర్దుబాటు చేయబోతున్నారు. అగ్రిమెంట్లు మార్చుకొని మరీ ఈ రెండు సినిమాల థియేటర్లలో భారీగా కోత వేయడానికి సిద్ధమౌతున్నారు.

దీనికి తోడు భరత్ అనే నేను సినిమా ఇంకా మార్కెట్లో కొనసాగుతోంది. వసూళ్ల సంగతి పక్కనపెడితే, ఎలాగోలా మరికొన్ని రోజులు ఈ సినిమాను థియేటర్లలో లాక్కురావాలని ఫిక్స్ అయ్యాడు నిర్మాత దానయ్య. అటు రంగస్థలం సినిమాను కూడా తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు ఉంచాలని నిర్ణయించాలి. ఇప్పటికే 46రోజుల రన్ పూర్తిచేసుకుంది కాబట్టి, 50 రోజుల రికార్డు కోసం చాలా థియేటర్లను హోల్డ్ లో పెట్టారు. 

ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ కొత్తగా సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్లు అందుబాటులో లేవు. టాక్సీవాలా వాయిదా పడ్డానికి ప్రధాన కారణం ఇదే. మరోవైపు విజయ్ ఆంటోనీ నటించిన కాశి, ఆర్.నారాయణ మూర్తి తెరకెక్కించిన అన్నదాత సుఖీభవ లాంటి సినిమాల్ని మాత్రం దొరికిన కొన్ని థియేటర్లలో ఈ వీకెండ్ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.