cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ Vs మహేష్.. పోటీ ఉందా లేదా?

పవన్ Vs మహేష్.. పోటీ ఉందా లేదా?

వచ్చే సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. వాటిలో ఒకటి సర్కారువారి పాట కాగా.. రెండోది హరిహర వీరమల్లు. ఈ రెండు సినిమాలు ఈసారి ఓ రేంజ్ లో పోటీపడతాయని అంతా భావించారు. కొన్నాళ్ల కిందటే దీనిపై కథనాలు కూడా వచ్చేశాయి. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. పవన్, మహేష్ మధ్య బాక్సాఫీస్ వార్ ఉండకపోవచ్చు.

మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట సినిమా సంక్రాంతికి రెడీ అయిపోతుంది. ఎంత తాపీగా షూటింగ్ చేసుకున్నా సంక్రాంతికి సినిమాను రెడీ చేయడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే, ఇందులో గ్రాఫిక్స్ లేవు, భారీ సెట్స్ లేవు.

కానీ హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం ఇటు గ్రాఫిక్స్, అటు సెట్స్ రెండూ అవసరమే. అందుకే ఈ సినిమా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఏఎం రత్నం చెబుతున్నాడు. కరోనా సెకెండ్ వేవ్ వల్ల అన్ని పనులు ఆగిపోయాయనని, సినిమా షూటింగ్ పూర్తవ్వడానికి ఇంకా చాలా టైమ్ పట్టేలా ఉందని చెప్పుకొచ్చాడు రత్నం.

హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి 40శాతం షూటింగ్ పూర్తయింది. మిగతా షూటింగ్ కంప్లీట్ చేయడానికి కనీసం 4 భారీ సెట్లు అవసరం. కరోనా వల్ల ఆ పనులన్నీ ఆగిపోయాయి. పైగా ఈ సినిమా కంటే ముందు.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చేస్తున్న రీమేక్ మూవీని పవన్ పూర్తిచేయాల్సి ఉంది.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కంప్లీట్ అయితే తప్ప క్రిష్ మూవీ స్టార్ట్ చేయలేని పరిస్థితి. కాబట్టి హరిహర వీరమల్లు సినిమా ఆలస్యమౌతుంది. చెప్పిన తేదీకి ఈ సినిమా రిలీజ్ అవ్వదు. అంటే.. పవన్ కల్యాణ్, మహేష్ బాబు మధ్య పోటీ లేనట్టే.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×