Advertisement


Home > Movies - Movie News
ఇకపై అక్కినేని సమంత

ఇలా పెళ్లవ్వడమే ఆలస్యం, ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఓ మార్పును వెంటనే అమలుచేసింది సమంత. అదే ఇంటిపేరు మార్పు. అవును.. సమంత రుతుప్రభు కాస్తా ఇప్పుడు సమంత అక్కినేనిగా మారింది. 

పెళ్లి అయిన తర్వాత ఆడపిల్ల ఇంటిపేరు మారడం సహజమే. కానీ సమంత మాత్రం అలా పేరు మార్చుకోవడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూసినట్టుంది. అందుకే ఇలా పెళ్లి తంతు పూర్తవ్వగానే, అలా సోషల్ మీడియాలో తన ఇంటిపేరు మార్చేసింది. సమంత అక్కినేని అంటూ తన ప్రొఫైల్ ను రీనేమ్ చేసింది.

నిజానికి చాలామంది సెలబ్రిటీలు పెళ్లి తర్వాత కూడా తమ ఇంటిపేరును మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి వాళ్లు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. అటు బాలీవుడ్ లో మరో రకమైన కల్చర్ నడుస్తోంది.

ఉదాహరణకు ఐశ్వర్య రాయ్ నే చూసుకుంటే... ఆమె తన పేరును ఐశ్వర్యరాయ్ బచ్చన్ గా మార్చుకుంది. ఇక కరీనా కపూర్ అయితే తన పేరును కరీనా కపూర్ ఖాన్ గా మార్చుకుంది. ఇలా రెండు ఇంటిపేర్లు వచ్చేలా మార్పులు చేసుకున్నారు. కానీ సమంత మాత్రం కావాలనే తన పేరును సమంత అక్కినేనిగా మార్చుకుంది. అక్కినేని అనే బ్రాండ్ ను తనకుతానుగా ఆపాదించుకుంటోంది.