cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఆఖరి అస్త్రం: 2 ఈవెంట్లు, చిరంజీవితో ప్రచారం

ఆఖరి అస్త్రం: 2 ఈవెంట్లు, చిరంజీవితో ప్రచారం

ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నా పేరు సూర్య సినిమాపై మాత్రం ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వలేదు. దశలవారీగా విడుదల చేస్తున్న సాంగ్స్ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించకపోగా.. స్టిల్స్ కూడా ఎందుకో పెద్దగా క్లిక్ అవ్వడం లేదు. దీంతో ఇక ఆఖరి అస్త్రంగా చిరంజీవిని కూడా వాడేస్తున్నారు నా పేరు సూర్య మేకర్స్.

చిరంజీవిని ప్రత్యేకంగా నా పేరు సూర్య సెట్స్ కు ఆహ్వానించారు. ఓ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ కు వచ్చారు చిరు. ఆ వెంటనే ఆయనతో ఓ గ్రూప్ ఫొటో దిగడం, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం చకచకా జరిగిపోయాయి. స్వయంగా బన్నీ కూడా ఈ స్టిల్ షేర్ చేసి, చిరంజీవి చూస్తుండగా డాన్స్ చేయలేకపోతున్నానని ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం ఈ స్టిల్స్, సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతున్నాయి. దీంతో పాటు త్వరలోనే రెండు భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తోంది నా పేరు సూర్య యూనిట్. వీటిలో ఒక ఈవెంట్ ను మిలట్రీ మాధవరం అనే ఊరిలో ప్లాన్ చేశారు. ఈ ఊరి నుంచి అంతా సైనికులుగా వెళ్లేందుకే ఇష్టపడతారు. దాదాపు ప్రతి ఇంటి నుంచి జవాన్ ఉంటాడు. సో.. మిలట్రీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న నా పేరు సూర్య సినిమా ఫంక్షన్ ను ఈ ఊరిలో నిర్వహించబోతున్నారు. దీన్ని ఓ విధంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అనుకోవచ్చు.

మరోవైపు కీలకమైన మరో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో ఈనెల 29న ప్లాన్ చేశారు. ఈ వేడుకకు అటు చిరంజీవి, ఇటు ప్రభాస్ ను ప్రత్యేక అతిథులుగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇలా ఈ రెండు మెగా ఈవెంట్లతో సినిమాను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చేనెల 4న నా పేరు సూర్య సినిమా విడుదలకానుంది.