cloudfront

Advertisement


Home > Movies - Movie News

బన్నీ సినిమాపై పాజిటివ్ సెంటిమెంట్

బన్నీ సినిమాపై పాజిటివ్ సెంటిమెంట్

మే 4న విడుదల కానుంది నా పేరు సూర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. రన్ టైం ఫిక్స్ అయింది. ఈ సినిమా నిడివి 2గంటల 48నిమిషాలుంది.

రెగ్యులర్ తెలుగు సినిమా నిడివితో పోలిస్తే.. సరిగ్గా 18నిమిషాలు ఎక్స్ ట్రా రన్ టైం కలిగి ఉంది నా పేరు సూర్య సినిమా. అయితే మూవీలో ఉన్న ఎమోషనల్ కంటెంట్ కారణంగా సినిమాను కత్తిరించలేదని, ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని అంటున్నారు మేకర్స్.

ఇలా లాంగ్ రన్ టైమ్ తో సినిమాలు రావడం ఈమధ్య కామన్ అయిపోయింది. గమ్మత్తుగా అలా వచ్చిన సినిమాలు హిట్ కూడా అవుతున్నాయి. అర్జున్ రెడ్డితో ఈ సంప్రదాయం మొదలైంది. ఆ సినిమా 3గంటల 10నిమిషాలుంది. ఆ తర్వాత రంగస్థలం సినిమా 3గంటల డ్యూరేషన్ కలిగి ఉంది. రీసెంట్ గా వచ్చిన భరత్ అనే నేను సినిమా 2గంటల 53నిమిషాలుంది.

ఈ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. సో.. లాంగ్ రన్ టైమ్ తో వస్తున్న నా పేరు సూర్య కూడా హిట్ అవుతుందనే పాజిటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మరోవైపు ఈ సినిమా సెన్సార్ టాక్ బయటకొచ్చింది. భరత్ అనే నేను, రంగస్థలం సినిమాల టైపులోనే ఇది కూడా ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిందని, రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా ఇందులో కనిపించదని అంటున్నారు.