Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఖరీదైన కారుకు అంతే ఖరీదైన నంబర్

ఖరీదైన కారుకు అంతే ఖరీదైన నంబర్

ఈమధ్య ఓ ఖరీదైన కారును ఎన్టీఆర్ కొన్న సంగతి తెలిసిందే. లాంబోర్గినీ కంపెనీకి చెందిన యురుస్ మోడల్ కారును కొనుగోలు చేశాడు తారక్. ఈ మోడల్ కు సంబంధించి ఇండియాలో ఫస్ట్ కస్టమర్ ఎన్టీఆరే. 3 కోట్ల రూపాయలకు పైగా ఖరీదు చేసే ఈ  మోడల్ కారు, ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది.

ఎంతో ఇష్టపడి, ఎంతో ఖర్చుపెట్టి కొన్న ఈ కారుకు.. అంతే ఖరీదైన నంబర్ ప్లేట్ తగిలించబోతున్నాడు  ఎన్టీఆర్. ఈ కారుకు TS09 FS 9999 అనే నంబర్ ను 17 లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు.

తన వాహనాలు అన్నింటికీ 9 అంకె వచ్చేలా నంబర్లు తీసుకోవడం ఎన్టీఆర్ కు సెంటిమెంట్. ఎన్నో ఏళ్లుగా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు తారక్. అందుకే తన కొత్త కారుకు కూడా ఇలా 9 అంకె వచ్చేలా ప్లాన్ చేశాడు. రీసెంట్ గా జరిగిన ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటలో 17 లక్షల రూపాయలకు ఈ నంబర్ ను తారక్ దక్కించుకున్నాడు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. త్వరలోనే కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?