cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సోషల్ మీడియాకు దూరంగా ఉండు రాజమౌళి

సోషల్ మీడియాకు దూరంగా ఉండు రాజమౌళి

దర్శకుడు రాజమౌళి ఈ రోజంతా కాస్త ఆ సోషల్ మీడియాకు దూరంగా ఉండడం బెటర్. ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటివి ఆయన ఈరోజు ఓపెన్ చేయకుండా ఉంటే చాలా మంచిది. అవును.. రాజమౌళిపై, ఆర్ఆర్ఆర్ యూనిట్ పై అర్థరాత్రి నుంచి ఓ రేంజ్ లో ట్రోల్ నడుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆనందం లేకుండా చేశారంటూ ఫ్యాన్స్ అంతా ఒకటే కామెంట్స్.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఎన్టీఆర్ టీజర్ రావాలి. "రామరాజు ఫర్ భీమ్" అనే కాన్సెప్ట్ తో రాబోయే ఆ టీజర్ కోసం ఫ్యాన్స్ అంతా చాలా ఆశగా ఎదురుచూశారు. అయితే లాక్ డౌన్ కారణంగా టీజర్ రెడీ చేయలేకపోయామని 2 రోజుల కిందట యూనిట్ ప్రకటించింది.

ఈ విషయాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు. కానీ వాళ్ల బాధ టీజర్ రానందుకు కాదు. కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటిది కూడా రిలీజ్ చేయడం లేదంటూ యూనిట్ ప్రకటించడం వాళ్లను ఇబ్బందిపెట్టింది. పుట్టినరోజు నాడు ఏదో ఒకటి రిలీజ్ చేసి సరిపెట్టడం, చేతులు దులుపుకోవడం తమకు ఇష్టంలేదని యూనిట్ సమర్థించుకోవడంలో అర్థం ఉన్నప్పటికీ.. బర్త్ డేకు ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి హంగామా లేకపోవడం మాత్రం ఫ్యాన్స్ కు పెద్ద వెలితిగా మారింది.

టీజర్ లేకపోయినా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ అయినా ఉంటుందని మొన్నటివరకు ఎదురుచూసిన అభిమానులకు అది కూడా లేదని తేలిపోవడంతో నిరాశే మిగిలింది. అందుకే ఈరోజు పొద్దున్నుంచే ఆర్ఆర్ఆర్ యూనిట్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అభిమానం అంటే ఆమాత్రం కోపతాపాలు ఉంటాయి. ఇప్పుడు ట్రోల్ చేస్తున్న అభిమానులే రేపు ఎన్టీఆర్ టీజర్ వచ్చిన తర్వాత రాజమౌళిని ఆకాశానికెత్తేస్తారు. జరగబోయేది ఇదే. రాజమౌళికి కూడా ఈ విషయం తెలుసు. కాకపోతే ఈ ఒక్కరోజు ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంతే.

జన్మనిచ్చిన గడ్డపైనే కక్ష

తెలంగాణా ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తాం