
ప్రతి హీరోకు ఇష్టమైన వంటకాలు కొన్ని ఉంటాయి. ఈ విషయంలో హీరోయిన్లు రకరకాల పేర్లు చెబుతారు కానీ హీరోలు మాత్రం ట్రెడిషనల్ రుచులకే ప్రాధాన్యం ఇస్తారు.
ఉదాహరణకు మహేష్ బాబునే తీసుకుంటే, మహేష్ కు వాళ్ల అమ్మ చేసే పప్పుచారు అంటే చాలా ఇష్టం. మరి ఎన్టీఆర్ కు ఏ వంటకం అంటే ఇష్టం?
ఎన్టీఆర్ నాన్-వెజ్ ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. సో.. ఆయనకు నచ్చిన వంటకం కూడా అదే. అమ్మ చేసే రొయ్యల బిర్యానీ అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం అంట. దీంతో అమ్మ చేసే నాటుకోడి కూర, నాటుకోడి వేపుడు అన్నా కూడా తారక్ కు చాలా ఇష్టం.
అమ్మ చేతి వంటలే కాదు, అప్పుడప్పుడు ఎన్టీఆర్ కూడా కొత్త కొత్త రుచులు ప్రయత్నిస్తుంటాడు. కాస్త ఫ్రీ టైమ్ దొరికితే వంటిట్లోకి వెళ్లి గరిటె తిప్పుతుంటాడు. అయితే అప్పుడు కూడా ఎన్టీఆర్ ట్రై చేసేది నాన్-వెజ్ రుచులు మాత్రమే.
బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన టైమ్ లో ఏకంగా హౌజ్ లోకి వెళ్లిపోయి, హౌజ్ మేట్స్ అందరికీ ఎన్టీఆర్ తన చేతి వంట రుచిచూపించిన సంగతి తెలిసిందే.
అదే పని అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేస్తుంటాడట. తను వంట చేస్తుంటే అభయ్ చాలా ఆసక్తిగా గమనిస్తుంటాడని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.
విక్రమార్కుడు కంటే పవర్ పుల్
దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు