cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్-త్రివిక్రమ్-విష్ణు

ఎన్టీఆర్-త్రివిక్రమ్-విష్ణు

క్రాక్ సినిమాతో తెలుగు సినిమా జనాల దృష్టిని ఆకర్షించాడు సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ లతో కలిసి ఆ సినిమా కోసం చిత్రీకరించిన ఫైట్ సీన్లు క్రాక్ సినిమాకు ప్రాణం పోయడమే కాక, హిట్ దారిలో నడిపించాయి. దాంతో అందరి దృష్టి విష్ణు మీద పడింది.

నిజానికి విష్ణు గతంలోనే మెర్సాల్, విజిల్ సినిమాలకు పనిచేసి శభాష్ అనిపించుకున్నాడు. క్రాక్ తో  మరో మెట్టు పైకి ఎక్కేసాడు. దీంతో ఇప్పుడు అతనని వెదుక్కుంటూ ఓ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. 

ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా కోసం విష్ణు పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పిఎస్ వినోద్ ఇప్పటికే త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసారు. అదే వినోద్ దగ్గర గతంలో విష్ణు అసిస్టెంట్ గా పనిచేయడం విశేషం. 

విష్ణు ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయారు. ఎన్టీఆర్ సినిమా కోసం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఆఖరు వరకు డేట్ లు కేటాయించాలి. అలా ఇవ్వగలిగితే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాకు విష్ణు నే సినిమాటోగ్రాఫర్.

ఇది చాలా కష్టం మోహన్ బాబూ

 


×