2017లో గృహం సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చాడు సిద్దార్థ్. అదే ఏడాది సమంత, నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కట్ చేస్తే.. నాలుగేళ్ల తర్వాత తిరిగి ఈ అక్టోబర్ లో మహాసముద్రం సినిమాతో మరోసారి తెలుగులోకి వస్తున్నాడు సిద్దార్థ్. ఇప్పుడు ఇదే ఏడాది, ఇదే నెలలో సమంత, తన భర్త నుంచి విడిపోయింది. ఇది కాకతాళీయమే కావొచ్చు. కానీ సిద్దార్థ్ ఇలా టాలీవుడ్ లో అడుగుపెట్టడం, సమంత తన వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడం విధి విచిత్రం అనుకోవాలేమో.
సిద్దార్థ్-సమంత రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. శ్రీకాళహస్తిలో శాంతిపూజలు కూడా జరిపించారు. అంతా సెట్ అనుకున్న టైమ్ లో ఆఖరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత సమంత, నాగచైతన్యకు కనెక్ట్ అయింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఎప్పుడైతే సమంత టాలీవుడ్ లో సెటిల్ అయిందో, సిద్దార్థ్ పూర్తిగా టాలీవుడ్ కు దూరమయ్యాడు. అతడికి తెలుగు నుంచి అవకాశాలు రాలేదా లేక అతడే తప్పుకున్నాడా అనే విషయాన్ని పక్కనపెడితే, ఈ నాలుగేళ్లు తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయలేకపోయాడు సిద్ధూ. మధ్యమధ్యలో డబ్బింగ్ సినిమాలతో పలకరించినప్పటికీ స్ట్రయిట్ మూవీ అవకాశం మాత్రం రాలేదు.
మళ్లీ ఇన్నేళ్లకు తెలుగులో నేరుగా మహాసముద్రం సినిమా చేస్తున్నాడు సిద్దార్థ్. ఈనెలలోనే అది రిలీజ్ అవుతోంది. రీసెంట్ గా స్పైన్ సర్జరీ చేయించుకున్న ఈ నటుడు, 2 రోజుల క్రితమే డబ్బింగ్ చెప్పేందుకు హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నాడు. అతడు హైదరాబాద్ లో ఉంటుండగానే, సమంత-నాగచైతన్య విడిపోతున్నట్టు స్టేట్ మెంట్ వచ్చింది. ఇది కూడా కాకతాళీయమే కావొచ్చు.
మొత్తమ్మీద సిద్దార్థ్ టాలీవుడ్ లో మరోసారి ఎంటర్ అవ్వడం, సరిగ్గా అదే టైమ్ లో సమంత తన వైవాహిక జీవితం నుంచి ఎగ్జిట్ అవ్వడం ఒకేసారి జరిగాయి. సమంత తనను మోసం చేసిందని అనుక్షణం ఫీల్ అయ్యే సిద్దార్థ్.. ఆమె నాగచైతన్య నుంచి విడిపోయిందని తెలిసిన వెంటనే పరోక్షంగా ఓ ట్వీట్ పెట్టాడు. మోసం చేసేవాళ్లు మంచిగా బ్రతకలేరంటూ పోస్ట్ చేశాడు.