Advertisement


Home > Movies - Movie News
ఆఫీసర్.. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్

నాగార్జున-వర్మ కాంబోలో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా ఫ్లాప్ అవుతుందనే విషయం విడుదలకు ముందే చాలామందికి తెలుసు. ఇక విడుదలైన మొదటి రోజే జనాలందరికీ తెలిసిపోయింది. అయితే ఇప్పుడు అందరికీ అర్థమైన విషయం ఏంటంటే దీన్ని కేవలం ఫ్లాప్ అనడానికి వీల్లేదు. ఇదొక బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ.

నాగార్జున కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో టాప్-5 ప్లేస్ లో నిలుస్తుంది ఈ సినిమా. విడుదలైన మొదటి రోజు ఏపీ, నైజాం కలుపుకొని 9లక్షల రూపాయల షేర్ కూడా రాబట్టలేకపోయిన ఈ సినిమా తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. జూన్ 1న విడుదలైన ఈ సినిమా గట్టిగా వారం కూడా నిలబడలేకపోయింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన థియేటర్ల నుంచి ఆఫీసర్ ను పూర్తిగా తొలిగించారు. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండే మార్నింగ్, మాట్నీ షోలలో కూడా ఆఫీసర్ ను ప్రదర్శించడం లేదు. తన ఫైనల్ రన్ లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 75లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి.

కనీసం కోటి మార్క్ కూడా అందుకోలేకపోవడం అత్యంత దారుణమైన విషయం. చివరికి నాగార్జున స్టార్ డమ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. కేవలం నాగార్జునను నమ్మి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 3కోట్ల 50లక్షల రూపాయలకు కొన్న బయ్యర్లు నిలువునా మునిగిపోయారు.