cloudfront

Advertisement


Home > Movies - Movie News

అఫీషియల్: వాయిదాపడిన ఆఫీసర్

అఫీషియల్: వాయిదాపడిన ఆఫీసర్

అందరూ ఊహించిందే జరిగింది. ఆఫీసర్ సినిమా వాయిదాపడింది. నాగార్జున హీరోగా తెరకెక్కించిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు స్వయంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. ఈనెల 25న విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ 1న వస్తోంది.

"ముందు అనుకున్న టైమ్ ప్రకారం కాకుండా, ఇంకాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నాం. మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం కొన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ కు ఎక్కువ టైం పడుతోంది. ఆఫీసర్ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయించాం. మే 25నుంచి జూన్ 1కు వాయిదా వేశాం."

మరోవైపు ఈ సినిమా ట్రయిలర్ ను అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయడంపై ఆనందం వ్యక్తంచేశాడు వర్మ. బిగ్ బి కోసం తను, నాగార్జున కలిసి ప్రత్యేకంగా ఓ షో ఏర్పాటుచేస్తామని ప్రకటించిన ఆర్జీవీ.. పాతికేళ్ల గ్యాప్ తర్వాత తను, నాగార్జున కలిసి చేస్తున్న ఈ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలుంటాయని ప్రకటించాడు.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి చిన్న లీగల్ వివాదం తలెత్తింది. తమకు చెల్లించాల్సిన కోటి రూపాయల బకాయిని చెల్లించకుండా, ఆఫీసర్ సినిమాను విడుదల చేయొద్దని కోరుతూ వైటీ ఎంటర్ టైన్ మెంట్ అనే సంస్థ కోర్టులో కేసు వేసింది. దీనిపై వర్మ తరఫున సహ-నిర్మాత సుధీర్ చంద్ర వివరణ ఇచ్చారు. మరో 2రోజుల్లో ఆ ఎమౌంట్ ను సెటిల్ చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.