Advertisement

Advertisement


Home > Movies - Movie News

పది సీక్వెల్స్ అయినా చేస్తాడట!

పది సీక్వెల్స్ అయినా చేస్తాడట!

'రాజుగారి గది త్రీ' అంటూ వస్తున్న ఓంకార్ ఈ సినిమాకు పది సీక్వెల్స్ అయినా చేయడానికి రెడీ అంటున్నాడు. 'రాజుగారి గది -10' కూడా వస్తుందని చెబుతున్నాడు. రెండో గది అంతగా విజయవంతం కాలేదు. ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేని తొలిపార్ట్ విజయవంతం కావడంతో, సీక్వెల్ పార్ట్ లో స్టార్స్ చేరారు. అది రీమేక్ కాన్సెప్ట్,

మలయాళీ సినిమా 'ప్రేతమ్'కు రీమేక్ గా 'రాజుగారి గది 2' ని రూపొందించారు. నాగార్జున, సమంత వంటి వాళ్లు నటించినా ఆ సినిమా హిట్ అనిపించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు మూడో పార్టును తీసుకు వస్తున్నారు. హారర్-కామెడీలకు ఇంకా మార్కెట్ మిగిలేఉందనే ఆశాభావంతో ఈ సినిమాను రూపొందించినట్టుగా ఉన్నారు.

ఇక రెండో సినిమా ఫెయిల్యూర్ కు బాధ్యత తనది కాదన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఓంకార్. అది రీమేక్ కావడం, ముందుగా తమన్నాను హీరోయిన్ గా అనుకోవడం.. ఆ సినిమా ఫెయిల్యూర్ కు ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయని అంటున్నాడు. మూడో పార్ట్ మాత్రం హిట్ అవుతుందని అంటున్నాడు.

ఆ తర్వాత ఈ సినిమాకు నాలుగు, ఐదు.. పదివరకూ సీక్వెల్స్ తీసే ఉద్దేశం ఉందంటున్నాడు. మరి అన్ని సీక్వెల్స్ కు చాన్స్ ఉందా, అంత సీనుందా.. అంటే ఈ మూడోపార్ట్ విజయమే ఈ విషయాలను తేల్చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.

జ్ఞానం రాత్రికి రాత్రి రాదు.. విద్యార్జన నిరంతర ప్రక్రియ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?