cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాగ‌చైత‌న్య‌తో గొడ‌వ‌ల‌పై ...

నాగ‌చైత‌న్య‌తో గొడ‌వ‌ల‌పై ...

అక్కినేని వారి కోడ‌లు స‌మంత పెళ్లి త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా త‌న స్థానాన్ని నిల‌బెట్టుకున్నారు. నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత ...చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే స‌మంత సైడ్ అవుతార‌ని సినీ అభిమానులు భావించారు. అయితే అలాంటేదేమీ జ‌ర‌గ‌క‌పోగా, మ‌రింత స్ట్రాంగ్ కావ‌డం ఇండ‌స్ట్రీలో ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

మొద‌టి నుంచి త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమానుల‌ను సంపాదించుకున్న స‌మంత‌కు, నాగ‌చైత‌న్య‌తో వివాహం త‌ర్వాత అక్కినేని ఫ్యాన్స్ ఆద‌ర‌ణ కూడా తోడైంది. ప్రస్తుతం సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ వెబ్‌ సీరీస్‌లో నటిస్తున్నారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో అభిమానుల‌తో స‌మంత‌ ముచ్చటించారు. 

తన వ్యక్తిగత జీవితం గురించి ఇంట్రెస్టింగ్ సంగ‌తుల‌ను పంచుకున్నారు. ప్రతి వ్యక్తి  తన ఇష్టాలేంటో తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. అంతేకాదు, ముందు తమను తాము ప్రేమించుకున్నప్పుడే జీవితాన్ని ఆనందమ‌యం చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అమ్మ‌డు చెప్పుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా త‌న ఇష్టాలేంటో స‌మంత వెల్ల‌డించారు. తన విషయానికి వస్తే నవ్వు, కళ్లు, తన శరీర బలం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని స‌మంత పేర్కొన్నారు.  ప్రతి రోజు ఓ గంట పాటు వ్యాయామం లేదా యోగాకు స‌మ‌యాన్ని కేటాయిస్తే ... దాని వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గ‌డ‌పొచ్చ‌ని స‌మంత తెలిపారు.

తన భర్త నాగ చైతన్య గురించి కూడా మ‌న‌సులో మాట చెప్పారామె. తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని స్ప‌ష్టం చేశారు. అయితే ప్రతిసారి మొదట రాజీ అయ్యేది మాత్రం తానేన‌ని చెప్పారామె. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఆ మాత్రం స‌ర‌దా గొడ‌వ‌లు లేక‌పోతే ...ప్రేమ ఎలా పెరుగుతుంది? అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా స‌మంత మ‌న‌సులో మాట‌ను సంద‌ర్భాన్ని బ‌ట్టి బ‌య‌ట‌పెడుతూ ఉంటారు. 

గడ్డం పెంచగానే మాస్ లీడర్ అయిపోవు లోకేష్

సాయం చేయడం నా తల్లి నుంచే నేర్చుకున్నా

 


×