cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఏంటి తమన్ ఇది.. మరీ ఇంత పబ్లిక్ గానా..!

ఏంటి తమన్ ఇది.. మరీ ఇంత పబ్లిక్ గానా..!

పక్కోడి ట్యూన్స్ ఎత్తేయడంతో పాటు తన ట్యూన్స్ కూడా తనే రిపీట్ చేస్తుంటాడనే విమర్శ తమన్ పై చాన్నాళ్లుగా ఉంది. ఆ విమర్శను తిప్పికొట్టాలని, దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవాలని ఈ మ్యూజిక్ డైరక్టర్ ఎప్పుడూ అనుకోడేమో. తాజాగా మరోసారి ఇదే టైపులో విమర్శల పాలవుతున్నాడు తమన్.

నిన్ననే అరవింద సమేత ఆడియో సాంగ్స్ అన్నీ మార్కెట్లోకి వచ్చాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పాటలు ఇలా మార్కెట్లోకి వచ్చాయో లేదో, తమన్ వాటిని ఎక్కడ్నుంచి ఎలా ఎత్తేశాడో, విజువల్స్ తో సహా సోషల్ మీడియాలో క్లిప్పింగులు కుప్పలుతెప్పలుగా పడుతున్నాయి.. 

మరీ ఆశ్చర్యంగా ఈసారి తన ట్యూన్స్ ను తానే కాపీకొట్టాడు తమన్. ఛల్ మోహన్ రంగలో ఇచ్చిన ఓ ట్యూన్ నే యాజ్ ఇటీజ్ గా అరవింద సమేత కోసం వాడేశాడు. ఇక గతంలో రవితేజ నటించిన నిప్పు సినిమాకు ఇచ్చిన ట్యూన్ నే మరో పాటకు వాడేశాడు. ప్రస్తుతం ఆ ఆడియో సాంగ్స్ ను, గతంలో వచ్చిన పాటలతో పోలుస్తూ చాలా క్లిప్పింగులు యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లో దర్శనమిస్తున్నాయి. 

తమన్ గాడిలో పడ్డాడని, తొలిప్రేమ లాంటి సినిమాలకు కాస్త ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడని మొన్నటివరకు చాలామంది సంతోషించారు. కానీ అరవింద సమేత పాటలు విన్న తర్వాత మళ్లీ పాత తమన్ మరోసారి అందరికీ గుర్తొచ్చాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. ఏ సంగీత దర్శకుడితోనైనా కాస్త ఫ్రెష్ ట్యూన్స్ రాబట్టుకుంటాడనే పేరున్న త్రివిక్రమ్ కూడా తమన్ దగ్గరకొచ్చేసరికి ఫెయిల్ అయిపోయాడు. 

చివరికి జూక్ బాక్స్ లో ఉన్న ఒకే ఒక్క డ్యూయట్ "రెడ్డి ఇటు సూడు" సాంగ్ కూడా గతంలో ఎక్కడో రభస లాంటి సినిమాల్లో విన్నట్టే ఉంది తప్ప, కొత్తగా ఏం అనిపించలేదు. మరి తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదు. సాంగ్స్ పై త్రివిక్రమ్ పెద్దగా దృష్టి పెట్టలేదా..? లేక తమన్ నుంచి ఇంతకంటే అవుట్ పుట్ ఆశించడం ఎందుకని ఊరుకున్నాడా..? తెరవెనక ఏం జరిగిందో 'అరవింద'కే ఎరుక. 

మరోవైపు తమన్ మాత్రం సోషల్ మీడియాలో తన రీట్వీట్లు ఆపడం లేదు. ఎవరు పొగుడుతున్నారో, ఎవరు తిడుతున్నారో కూడా అర్థం చేసుకోకుండా ప్రతి కామెంట్ కు రీట్వీట్లు దంచికొడుతున్నాడు.