Advertisement

Advertisement


Home > Movies - Movie News

సలార్ సినిమాపై ఇంకో క్లారిటీ వచ్చేసింది

సలార్ సినిమాపై ఇంకో క్లారిటీ వచ్చేసింది

సలార్ సినిమాలో ప్రభాస్ నే ఎందుకు తీసుకున్నారనే విషయంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తన సినిమాలో హీరో అమాయకంగా కనిపించాలని, ఆ తర్వాత ఉగ్రరూపం దాల్చాలని, అందుకే ప్రభాస్ ను హీరోగా తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ దర్శకుడు సలార్ కు సంబంధించి మరో క్లారిటీ ఇచ్చాడు.

సలార్ ప్రాజెక్టు ప్రకటించిన మరుక్షణం ఆ సినిమా ఓ రీమేక్ అంటూ ప్రచారం మొదలైంది. మరీ ముఖ్యంగా 2014లో ప్రశాంత్ నీల్ తీసిన ఉగ్రమ్ సినిమాకు రీమేక్ గా సలార్ రాబోతోందనే పుకారు బాగా వ్యాపించింది. దీనికి ఓ కారణం కూడా ఉంది.

ఉగ్రమ్ సినిమాలో మాఫియా డాన్ ఉంటాడు, అండర్ వరల్డ్ కథ అది. సలార్ సినిమా కూడా దాదాపు ఇలాంటి కథే. ప్రభాస్ ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ గా కనిపించబోతున్నాడనే విషయం టైటిల్, ప్రభాస్ లుక్, మూవీ ట్యాగ్ లైన్ తో తెలిసిపోయింది. దీంతో ఇది ఉగ్రమ్ కు రీమేక్ అని అంతా అనుకున్నారు.

తాజాగా ఈ రూమర్ పై రియాక్ట్ అయ్యాడు ప్రశాంత్ నీల్. సలాల్ సినిమా రీమేక్ కాదంటున్నాడు ఈ దర్శకుడు. కేజీఎఫ్ స్టోరీ రాసుకున్న టైమ్ లోనే సలార్ కాన్సెప్ట్ అనుకున్నాడట. ఇది పూర్తిగా కొత్త కథ అంటున్నాడు.

ఈ పాన్-ఇండియా మూవీకి సంబంధించి ఇప్పటికే ఆడిషన్స్ పూర్తయ్యాయి. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. త్వరలోనే హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఎనౌన్స్ చేయబోతున్నారు.

ఆ ముగ్గురూ ముగ్గురే

ఇంటి వ‌ద్ద‌కే బియ్యం

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?