Advertisement


Home > Movies - Movie News
హమ్మయ్య.. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి

రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2.0 సినిమా ఈ ఏడాది ఇక థియేటర్లలోకి రాదనుకున్నారంతా. ఎందుకంటే ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మధ్యలో అమెరికాకు చెందిన ఓ యానిమేషన్ కంపెనీ పూర్తిగా దివాలా తీయడంతో 2.0 పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలా డైలమాలో పడిన ఈ 
సినిమా విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.

2.0 సినిమాపై స్వయంగా దర్శకుడు శంకర్ క్లారిటీ ఇచ్చాడు. తమ సినిమాను నవంబర్ 29న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. గ్రాఫిక్స్ కు సంబంధించి సదరు కంపెనీ డెలివరీ డేట్ ఫిక్స్ చేయడంతో.. ఆ వెంటనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాడు శంకర్. అలా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందనే అనుమానాలకు చెక్ పెట్టాడు.

నవంబర్ 29కు సంబంధించి బాలీవుడ్ లో పెద్ద సినిమాలతో ఎలాంటి పోటీలేదు. అమీర్ కు చెందిన ఓ సినిమా అప్పటికే విడుదలైపోతుంది. ఇటు టాలీవుడ్ లో కూడా 2.0తో ఎలాంటి క్లాష్ లేదు. ఎన్టీఆర్ సినిమా కూడా అప్పటికి థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఎటొచ్చి కోలీవుడ్ లోనే పరిస్థితి కాస్త పోటీ కనిపిస్తోంది. 

ప్రస్తుతం అజిత్, సూర్య నటిస్తున్న సినిమాల్ని నవంబర్ లోనే విడుదలకు ప్లాన్ చేశారు. ఈ రెండూ కాకపోయినా వీటిలో కనీసం ఒకటి 2.0కు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 450కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది 2.0 సినిమా. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇందులో విలన్ గా నటించాడు.