cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లైన ఆడ‌వాళ్లకు మాత్ర‌మే...ఇత‌రులు చ‌దవొద్దు ఫ్లీజ్‌!

పెళ్లైన ఆడ‌వాళ్లకు మాత్ర‌మే...ఇత‌రులు చ‌దవొద్దు ఫ్లీజ్‌!

పెద్ద‌ల‌కు మాత్ర‌మే ఈ సినిమా అని సెన్సార్ బోర్డు వాళ్లు స‌ర్టిఫికెట్ ఇస్తుంటారు. అలా ఎందుకు ఇస్తారో ఎప్పుడైనా ఆలోచిం చారా?  కొన్ని సంగ‌తులు చిన్న మ‌న‌సు అర్థం చేసుకునే వ‌య‌సు కాద‌నే ఉద్దేశంతో అలా ఇస్తుంటారు. జీవితంలో కొన్ని అర్థం కావాలంటే ఒక వ‌య‌సు రావాలి. అంత వ‌ర‌కు ఆగాల్సిందే. అందుకే క‌దా పెళ్లి వ‌య‌సును ఆడ‌వాళ్ల‌కు, మ‌గాళ్ల‌కు వేర్వేరుగా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌కు ఓ క్రేజ్‌. పూరీ మ్యూజింగ్స్ పేరుతో ఒక్కో అంశంపై ఆయ‌న త‌న‌దైన శైలిలో వినూత్నంగా చెబుతుండ‌డం తెలిసిందే. ఈ వారం ప‌ర్‌ఫెక్ట్ భ‌ర్త గురించి ఆయ‌న చెప్పిన సంగ‌తులు వైర‌ల్ అవుతున్నాయి.

పెళ్లైన ఆడ‌వాళ్లంద‌రికీ ఆయ‌న ఓ విన్న‌పం చేస్తూ ...జీవితం సుఖ‌మ‌యం కావాలంటే ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు. అందులో ముఖ్య‌మైన సంగ‌తుల‌ను తెలుసుకుందాం. అయితే పూరీ మీద గౌర‌వంతో ఇత‌రులెవ‌రూ వీటిని చ‌ద‌వొద్దు ఫ్లీజ్ ...

"జీవితంలో పెళ్లైన ఆడ‌వాళ్లంద‌రికి ఓ విన్న‌పం. జీవితంలో ప‌ర్‌ఫెక్ట్ తండ్రి, ప‌ర్‌ఫెక్ట్ త‌ల్లి, ప‌ర్‌ఫెక్ట్ డ్రైవ‌ర్, ప‌ర్‌ఫెక్ట్  నర్సు ఉండొచ్చేమో కాని ప‌ర్‌ఫెక్ట్ భ‌ర్త ఎక్క‌డ ఉండ‌డు. ఇదొక భ్ర‌మ‌. నా మొగుడ‌కి ఇలాంటి  క్వాలిటీసే ఉండాలి.

ఇలాంటి క్యారెక్టరే ఉండాలి అని పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని ప్రాబ్ల‌మ్స్‌లో ప‌డిపోతారు. మొగుడ్ని అంచ‌నా వేయ‌లేం.అందుకే పెళ్ళైన ప్ర‌తి ఆడది ఏదో ఒక స‌మ‌యంలో క‌న్నీళ్ళు పెట్టాల్సిందే, త‌ప్ప‌దు.

లైఫ్‌లో మిమ్మ‌ల్ని చాలా మంది చాలా సార్లు ఏడిపిస్తారు. ఎక్కువ‌గా ఏడిపించేది ఒక్క మొగుడు మాత్ర‌మే. ఎందుకంటే మీ ప‌క్క‌నే ఉంటాడు, ప‌క్క‌లోనే ఉంటాడు. చెప్పకుండా కొన్ని చేస్తాడు. చెప్పి కొన్ని చేస్తాడు, సీక్రెట్‌గా మ‌రెన్నో చేస్తాడు. అందుకే మీకు కాలుద్ది. త‌ప్పు లేదు. ఇవే త‌ప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. మీ నాన్న వ‌ల‌న మీ అమ్మ ఎన్ని సార్లు ఏడ్చిందో గుర్తు తెచ్చుకోండి. మీరు మీ నాన్న‌ను   క్ష‌మించ‌లేదా?  వాళ్ళ‌ను క్ష‌మించిన‌ట్టే, మొగుడిని క్ష‌మించండి.

మీ కంట్లో క‌న్నీరు చూడ‌క‌పోతే ప‌క్కింటి వ‌దిన గారికి అస్స‌లు న‌చ్చ‌దు. వాళ్ళ మాట‌లు విని అన‌వ‌స‌రంగా మొగుడితో గొడ‌వ ప‌డొద్దు. ఆమె మొగుడు ఏమ‌న్నా శ్రీరామ చంద్రుడా? అంద‌రి క‌న్నా ఎక్కువ‌గా ఏడ్చింది రాముడి పెళ్లామే.

ఇక త‌ప్పులు చేసే మొగుడ్ని మీ అన్న‌య్య‌, త‌మ్ముడు, నాన్న‌నో అనుకొని వ‌దిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మొగుడు లేక‌పోయిన కూడా ఉంటాయి.  ఇక్క‌డ ప‌ర్‌ఫెక్ట్ భ‌ర్త కాని ప‌ర్‌ఫెక్ట్ భార్య కాని ఎవ‌రు ఉండ‌రు. పెళ్లంటేనే అడ్జెస్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా.. అంతే" అంటూ పూరీ  చెప్పుకొచ్చాడు. ఆడ‌వాళ్లూ ...తెలిసిందా, అర్థ‌మైందా ఆయ‌నేం చెప్పారో! అంతే, అంతేగా. 

నిలువుటద్దం ముందు న్యాయవ్యవస్థ

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!