cloudfront

Advertisement


Home > Movies - Movie News

'పడి పడి లేచిన' టీజర్

'పడి పడి లేచిన' టీజర్

లై లాంటి పరమ డిజాస్టర్ తరువాత దర్శకుడు హను రాఘవపూడి చేస్తున్న రోమాంటిక్ జోనర్ ఫిల్మ్.. 'పడి పడి లేచె మనసు'. హిట్ ల మీదున్న హీరో శర్వానంద్, హీరోయిన్ సాయిపల్లవి లీడ్ పెయిర్. అమ్మాయి వెంట అబ్బాయి పడడం, అమ్మాయికి కాస్త ఏటిట్యూడ్, ఆపై ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కావడం.. ఇదే టీజర్.

సాధారణంగా ఏ రొమాంటిక్ ఫిల్మ్ టీజర్ లో అయినా కనిపించేది ఇదే. అయితే ఇక్కడ స్పెషల్ ఏమిటంటే, లీడ్ పెయిర్. ఇద్దరూ అందంగా, చూడాలనిపించేలా వున్నారు. శర్వానంద్ స్టయిల్ డైలాగ్ ఒక్కటి వేసి టీజర్ ను విజువల్ ట్రీట్ గా చేసారు. సాయిపల్లవి ఫిదాలో కన్నా కూడా అందంగా కనిపిస్తోంది. శర్వానంద్ కొత్త హెయిర్ స్టయిల్ తో కనిపించాడు.

ప్రేమించిన ప్రేయసి ప్రేమను మరచిపోతూ వుండడం, ప్రేమికుడు ఓపిగ్గా మళ్లీ మళ్లీ ప్రేమిస్తూ, ప్రేమను పొందుతూ వుండే కాన్సెప్ట్ తో తయారవుతోందీ సినిమా. ఈ లైన్ కు దగ్గరగా వుండే సినిమా ఒకటి ఆ మధ్య వచ్చింది. కానీ పడి పడి లేచె మనసుకు యాడెడ్ అడ్వాంటేజెస్ ఏమిటంటే, శర్వా, సాయిపల్లవి.

ఏ సబ్జెక్ట్ ను అయినా తరువాత లెవెల్ కు తీసుకెళ్లగలరు. హను రాఘవపూడి ఈసారి అయినా సరైన కమర్షియల్ హిట్ కొడతామో చూడాలి.