Advertisement

Advertisement


Home > Movies - Movie News

'పక్కా'గా యు/ఎ

'పక్కా'గా యు/ఎ

మారుతి-గోపీచంద్-రాశీఖన్నా కాంబినేషన్ లో బన్నీవాస్ నిర్మించిన సినిమా పక్కా కమర్షియల్. మరో వారంలో విడుదలకు రెడీ అవుతోంది. ఫస్ట్ కాపీ పక్కాగా రెడీ అయింది. అందుకే సెన్సార్ కు ఏదో ఒక కాపీ కాకుండా పక్కా ఫైనల్ కాపీనే అందించారు. 

సెన్సార్ నిబంధనల ప్రకారం కాస్త రక్తం కనిపించినా, ఓ ఫైట్ వున్నా, కొద్దిగా రొమాన్స్ వున్నా యు/ఎ తప్పదు. అందుకే పక్కాగా ఈ కమర్షియల్ సినిమాకు కూడా యు/ఎ వచ్చే సింది.

సెన్సారుకు ఇచ్చే ముందే నిర్మాత అల్లు అరవింద్ ఓ సారి సినిమా అంతా స్కాన్ చేసేసారు. వీలయినంత బగ్ ప్రూఫ్, ఫూల్ ప్రూఫ్ అనుకున్నాకే కాపీ బయటకు తీసారు. 

మారుతి స్టయిల్ ఫన్..గోపీచంద్ స్టయిల్ యాక్షన్...రాశీఖన్నా స్టయిల్ రొమాన్స్ మిక్సీలో వేసి మిక్స్ చేసి అందిస్తున్న కాక్ టయిల్ 'పక్కా కమర్షియల్'. 

ఓ కమర్షియల్ లాయర్ కు...రిటైర్డ్ న్యాయమూర్తి అయిన అతగాడి తండ్రికి మధ్య నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో అల్లుకున్న సరదా కథ. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, సప్తగిరి,ప్రవీణ్ అదనపు తారాగణం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?