cloudfront

Advertisement


Home > Movies - Movie News

పక్కా పందెం కోడే

పక్కా పందెం కోడే

పందెంకోడి, తెలుగు ఆడియన్స్ మరిచిపోలేని డబ్బింగ్ సినిమాల్లో ఒకటి. విశాల్ ఎన్ని సినిమాలు చేసినా, ఈ సినిమా తెచ్చిన క్రేజ్ ను, ఫాలోయింగ్ ను ఇవ్వలేదు. ఈ సినిమాకు సీక్వెల్ వుంటుందని దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి వినిపిస్తోంది. ఆఖరికి అది ఫైనల్ అయి, విడుదల వేళకు వస్తోంది.

రేసీ మాస్ డైరక్టర్ లింగుస్వామి డైరక్షన్లో ముస్తాబవుతున్న పందెంకోడి-2 సినిమా తెలుగు టీజర్ ఈరోజు విడుదలయింది. సాధారణంగా సీక్వెల్ అనగానే ముందుగా జనం చూసేది, తొలిభాగంతో సమానంగా వుందా? లేదా? అన్నదే. ఆ తరువాతే బెటర్ మెంట్. ఆ విషయంలో పందెంకోడి-2 టీజర్ పాసైపోయింది. ఏమాత్రం పందెంకోడి సినిమా వేగం, మీటర్ కు తగ్గకుండా రెండోభాగం రెడీ అవుతోందన్న క్లారిటీని ఈ టీజర్ ఇవ్వగలిగింది.

దాదాపు పార్ట్ వన్ ఛాయల్లోనే, దర్శకుడు లింగుస్వామి రెండోభాగం రెడీ చేస్తున్నట్లుంది. ఏదో ఓ క్రేజీ సినిమాకు సీక్వెల్ తీయాలని తీయడం కాకుండా, కాస్త గట్టిగా సబ్జెక్ట్ రెడీ చేసుకునే దిగినట్లు కనిపిస్తోంది. పులి మేక కలిసి ఆడే ఆట అని చెప్పడంలోనే ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

మహానటి తరువాత కీర్తిసురేష్ కనిపించే సినిమా ఇది. తెలుగులో విశాల్ తో కలిసి టాగోర్ మధు పందెంకోడి-2 సినిమాను అందిస్తున్నారు.