cloudfront

Advertisement


Home > Movies - Movie News

పాపం రకుల్‌.. అడ్డంగా బుక్కయిపోయింది

పాపం రకుల్‌.. అడ్డంగా బుక్కయిపోయింది

సోషల్‌ మీడియాలో హీరోయిన్లపై 'జుగుప్సాకరమైన' కామెంట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 'ట్రాలింగ్‌'కి ఏ సెలబ్రిటీ అతీతం కాదు అన్నట్టు తయారైంది పరిస్థితి. హీరోయిన్ల హాట్‌ హాట్‌ ఫొటోలపై సోషల్‌ మీడియాలో జరిగే ట్రాలింగ్‌ అంతా ఇంతా కాదు. జుగుప్సాకరమైన కామెంట్లు, కవితలు హోరెత్తిపోతుంటాయి. మార్ఫింగ్‌ ఫొటోల సంగతి సరే సరి.

అసలు విషయమేంటంటే, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి సంబంధించిన ఫొటోకి ఓ 'ఔత్సాహికుడు' చేసిన కామెంట్‌, ఆమెకు ఒళ్ళు మండేలా చేసింది. ఆ ఫొటోలో రకుల్‌, షార్ట్‌ నిక్కర్‌తో కారు దిగుతూ కన్పించింది. 'కారులో సెషన్‌.. ప్యాంట్‌ మర్చిపోయిన రకుల్‌' అన్నది ఆ కామెంట్‌ సారాంశం.

రకుల్‌ ఆగ్రహంతో ఊగిపోతూ, సదరు పోస్ట్‌ చేసిన వ్యక్తి తల్లిని దూషించేసింది. 'మీ అమ్మ చాలా సెషన్స్‌ కారులో చేసి వుంటుంది..' అంటూ విరుచుకుపడిపోయింది రకుల్‌. దాంతో, నెటిజన్లు ఇప్పుడు రకుల్‌ని మరింత గట్టిగా ట్రాల్‌ చేసేస్తున్నారు.

'మధ్యలో వాళ్ళ అమ్మ ఏం చేసింది.? నువ్వు తిట్టాలనుకుంటే ఆ వ్యక్తిని తిట్టొచ్చు. లేదంటే, ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. ఓ మహిళ అయి వుండీ, ఇంకో మహిళపై ఇలాంటి జుగుప్సాకరమైన కామెంట్‌ ఎలా చేశావ్‌.?' అంటూ రకుల్‌ని కడిగి పారేస్తున్నారు నెటిజన్లు.

తన ఉద్దేశ్యం ఇంకో మహిళను కించపర్చడం కానే కాదనీ, 'సిక్‌ మైండెడ్‌ పీపుల్‌'కి బుద్ధిరావాలనే అలాంటి కామెంట్‌ చేశానని రకుల్‌ వివరణ ఇచ్చుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే క్రమంలో శ్రీరెడ్డి సైతం ఇలాగే, పవన్ తల్లిపై నోరుజారేసి, వివాదాన్ని కొని తెచ్చుకున్న సంగతి తెల్సిందే.

అన్నట్టు.. అప్పట్లో శ్రీరెడ్డి.. రెక్కపీత.. అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడాన్ని ఎలా మర్చిపోగలం.?

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!