cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఒక దేవుడు.. ఒక హీరో..

ఒక దేవుడు.. ఒక హీరో..

గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పరశురాం తన కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. తనవద్ద ప్రస్తుతం 4-5 స్టోరీ ఐడియాలు రెడీగా ఉన్నాయని, కానీ వాటిలో ఓ స్టోరీలైన్ బన్నీ వాస్ కు బాగా నచ్చిందని చెబుతున్నాడు.

"4-5 ఐడియాలు ఉన్నాయి. కానీ బన్నీ వాస్ కు ఒక్కటే నచ్చింది. ఓ వ్యక్తికి, దేవుడికి మధ్య నడిచే కథ అది. ఈ కథ బన్నీ వాస్ కు నచ్చింది. దీన్నే డెవలప్ చేయాలని నిర్ణయించాను. స్టోరీ పూర్తిగా రెడీ అయిన తర్వాత అల్లు అరవింద్ గారికి వినిపిస్తాను."

ఈ సినిమాకు సంబంధించి ఇంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు పరశురాం. అయితే ఇది ఫాంటసీ సినిమా కాదని మాత్రం స్పష్టం చేశాడు. గోపాల గోపాల సినిమా ఛాయల్లో కూడా ఉండదని తెలిపాడు.

"ఈ సినిమా పక్కా ఎంటర్ టైనర్. మనం చెప్పుకుంటున్న దేవుడు స్థానంలో నిజానికి దేవుడు ఉండడు. ఓ గురువు మాత్రమే కనిపిస్తాడు. అతడికి, హీరోకు మధ్య జరిగే సన్నివేశాలే ఈ కథ. తాత్వికత, ఫాంటసీ లాంటివి ఇందులో కనిపించవు. అంతా సోషల్ డ్రామానే."

తన నెక్ట్స్ సినిమా గీతాఆర్ట్స్-2 బ్యానర్ పైనే ఉంటుందని స్పష్టంచేశాడు పరశురాం. కథ పూర్తిగా సిద్ధమైన తర్వాత నటీనటుల గురించి ఆలోచిస్తామన్నాడు. గీతగోవిందంకు 2 ఏళ్లు టైం తీసుకున్న ఈ దర్శకుడు, తన నెక్ట్స్ ప్రాజెక్టును మాత్రం ఏడాదిలోనే పూర్తిచేస్తానంటున్నాడు.