cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పరిస్థితిని ఓపెన్ గా చెప్పిన సప్తగిరి

పరిస్థితిని ఓపెన్ గా చెప్పిన సప్తగిరి

సాధారణంగా సినిమా ఫ్లాపు అయినా, యావరేజ్ అయినా హిట్ కొట్టామనే అంటారు సినిమా జనాలు.  కొందరు హీరోలు అయితే మరికొంత ముందుకు వెళ్లి, జనాలు చూస్తున్నారని, జనాలకు నచ్చిందని, సమీక్షకులకే నచ్చలేదు అని ఎదురుదాడికి దిగే హీరోలు కూడా వున్నారు. కమెడియన్ కమ్ హీరో సప్తగిరి కూడా అయితే గతంలో సప్తగిరి ఎల్ ఎల్ బి టైమ్ లో మీడియా విషయంలో కాస్త బాధపడ్డారు.

అయితే ఈవారం సప్తగిరి లేటెస్ట్ సినిమా వజ్రకవచధర గోవింద సినిమా విడుదలయింది. ఆశించిన మేరకు టాక్ రాలేదు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో సప్తగిరి మాట్లాడుతూ హానెస్ట్ గా ఒప్పుకున్నారు. సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చిందని, తరువాత యావరేజ్ అన్న టాక్ స్థిరపడిందని, నలభై శాతం ఆక్యుపెన్సీ వుందని ఓపెన్ గా అంగీకరించారు. సినిమా బడ్జెట్ కు, మార్కెట్ కు ఆ ఆక్యపెన్సీ అన్నది సరిపోతుందని అన్నారు. 

సినిమా సెకండాఫ్ లాగ్ అయిందని కొందరు చెప్పారని,  ఆ మేరకు పది నిమషాలు తీసేస్తున్నామని బహిరంగంగా వెల్లడించాడు సప్తగిరి. చిన్నవాళ్లమని, తమ తప్పులు చూడకుండా, కాస్త ఆదిరిస్తే ముందుకు వెళ్లగలమని, లేదంటే ఇక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వుంటుందని సప్తగిరి వేడుకోలుగా చెప్పడం విశేషం. 

సప్తగిరికి తన సినిమా పరిస్థితి క్లియర్ గా తెలియడం వేరు, ఓపెన్ గా ఒప్పుకుని, ఒబీడియెంట్ గా మాట్లాడడం చూస్తుంటే, సప్తగిరి ఎల్ ఎల్ బి టైమ్ కు ఇప్పటికీ బాగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.