Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ కల్యాణ్ అలా.. రేణుదేశాయ్ ఇలా..!

పవన్ కల్యాణ్ అలా.. రేణుదేశాయ్ ఇలా..!

కరోనా విలయంలో కొంతమంది మనుషుల్లో దాగి ఉన్న మానవత్వం బయటపడుతోంది, అదే సమయంలో ఇంకొంతమంది కరోనా కష్టకాలాన్ని కూడా రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటారని అర్థమైంది. ఎవరి సంగతి ఎలా ఉన్నా.. పవన్ కల్యాణ్, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్.. కరోనా సెకండ్ వేవ్ విజృంభణలో చెరో రకంగా స్పందిస్తున్నారు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకోడానికి పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారని అంటుంటారు. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ప్రధాన మంత్రి సహాయ నిధికి భారీ విరాళం ఇచ్చి మానవత్వం చాటుకున్నారు పవన్. అయితే సెకండ్ వేవ్ ఉధృతిలో మాత్రం కాస్త సైలెంట్ గా ఉన్నారు. 

విరాళాలు, నేరుగా సాయాలు.. అంటూ బయటకు రాలేకపోతున్నారు. పోనీ ఇంట్లో కూర్చున్న పవన్ సైలెంట్ గా ఉంటున్నారా అంటే అదీ లేదు. రుయా ఆస్పత్రి ఘటనను చంద్రబాబు చెత్త రాజకీయాలకు వాడుకుంటుంటే.. దానికి పరోక్షంగా సాయపడేలా ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారు పవన్.

వ్యాక్సినేషన్ ఆలస్యం కావడానికి, ఆక్సిజన్ కొరతకు కారణం కేంద్రమేనని స్పష్టంగా తెలుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలపై నిందలు వేయడంలో పవన్ కూడా ఓ చేయి వేయడం విచిత్రం. ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు సరికాదంటూనే.. పవన్ కల్యాణ్ నేరుగా జగన్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, సీమలో వైద్యాన్ని పట్టించుకోవడం లేదంటూ మరోసారి ప్రాంతీయ భేదం తీసుకొచ్చారు.

ఇక రేణూ దేశాయ్ విషయానికొస్తే.. ఆమె తన సామాజిక బాధ్యతను నెరవేర్చేందుకు నడుంకట్టారు. ఇనస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, మీకు అవసరమైన సాయం నేను అందిస్తా, నా ఇన్ స్టాగ్రామ్ మెసేజ్ ఇన్ బాక్స్ ఇప్పటి నుంచి ఓపెన్ లో పెడతానంటూ చెప్పారు రేణు. 

కరోనా కష్టకాలంలో మానవత్వం చాటుకున్నారు. ఆర్థిక సాయం చేయలేను కానీ అవసరానికి ఆదుకుంటా అని చెప్పారు. ప్లాస్మా అవసరం ఉన్నా, ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రిలో బెడ్స్ కావాలన్నా వెంటనే నాకు మెసేజ్ చేయండి, నా సర్కిల్ లో విచారించి వెంటనే సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. నిజంగా అవసరం ఉన్నవారే తనను సంప్రదించాలని ఆమె సూచించారు.

ఈ కరోనా కష్టకాలంలో ఓవైపు పవన్ కల్యాణ్ ఇలా రాజకీయ విమర్శలకే పరిమితం కాగా.. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ ఇలా సహాయం చేస్తానంటూ ముందుకొచ్చారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?