Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిరంజీవిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ అభ్యంత‌రక‌ర కామెంట్స్‌

చిరంజీవిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ అభ్యంత‌రక‌ర కామెంట్స్‌

మెగాస్టార్ చిరంజీవిపై ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేస్తుండడం చ‌ర్చ‌కు దారి తీసింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ స‌రికొత్త సంప్ర‌దాయానికి తెర‌తీశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ప‌వ‌న్‌కు సినీ జీవితాన్ని ప్ర‌సాదించిన చిరంజీవిపై ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు ట్రోల్ చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ...ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌శంసించ‌డంతో పాటు కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డ‌మే.

కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలకు జ‌గ‌న్‌ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లు 2020 ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు విద్యుత్‌ స్థిర చార్జీల చెల్లింపును పూర్తిగా రద్దు చేసింది. ఆ తర్వాత 6 నెలలకు (2020 జులై నుంచి డిసెంబర్‌ వరకు) విద్యుత్‌ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. 

బ్యాంకుల నుంచి సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్ప‌ష్టం చేసింది. అలాగే వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని పేర్కొంది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికులకు లబ్ధి కలిగేలా ఈ రాయితీలిచ్చినట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.  

ఏపీ ప్రభుత్వం చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో వైఎస్ జ‌గ‌న్‌ ఆదుకున్నారని ప్రశంసించారు. వేలాది కుటుంబాలకు ఊరట లభించింద‌ని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

ఇదే విష‌య‌మై టాలీవుడ్ హీరో నాగార్జున కూడా బుధ‌వారం ట్విటర్‌ వేదికగా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘మహమ్మారి వంటి విపత్కర సమయంలో సినిమా హాళ్ల‌ విద్యుత్‌ చార్జీలకు రాయితీ ఇచ్చి అవసరమైన సమయంలో అదుకుని భారీ ఊరట నిచ్చిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు’ అంటూ ఆయ‌న‌ ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండ‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను అభినందిస్తూ చిరంజీవి ట్వీట్ చేయ‌డాన్ని ప‌వ‌న్ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. చిరు ట్వీట్‌పై ప‌వ‌న్ అభిమానులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుప‌తిలో జ‌గ‌న్‌ను తీవ్ర‌స్థాయిలో త‌మ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ విమ‌ర్శించార‌ని, తాజాగా తిరుప‌తి ఉప‌ ఎన్నిక‌ ముంగిట జ‌గ‌న్‌ను అభినందించ‌డం ఏంటంటూ చిరుపై ఆగ్ర‌హంతో ట్రోల్ చేయ‌డం గ‌మ‌నార్హం.

త‌మ్ముని రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను ఇర‌కాటంలో ప‌డేసేలా చిరు ట్వీట్ ఉంద‌ని మ‌రికొంద‌రు కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ప‌వ‌న్ తీవ్రంగా వ్య‌తిరేకించే జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డాన్ని అస‌లు త‌ట్టుకోలేకున్నార‌ని సోష‌ల్ మీడియాలో ఆయ‌న అభిమానుల కామెంట్స్ తెలియ‌జేస్తున్నాయి. మ‌రికొంద‌రు అభిమానులు చిరుపై అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ కూడా చేశారు. ప‌వ‌న్ అభిమానుల వైఖ‌రిపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?