cloudfront

Advertisement


Home > Movies - Movie News

పవన్ Vs మహేష్.. అసలైన మహర్షి ఎవరు?

పవన్ Vs మహేష్.. అసలైన మహర్షి ఎవరు?

మహర్షి సినిమా మహేష్ బాబు అభిమానులతో పాటు.. సామాన్యుల్లో కూడా ఆలోచన రేకెత్తిస్తోంది. కర్షకుల కష్టాలను, తెరపై చూపించిన ప్రిన్స్ పై రైతు లోకం ప్రశంసలు కురిపిస్తోంది. అదే సమయంలో మహేష్ గత సినిమాల ప్రస్తావన కూడా వస్తోంది. వరుసగా సమాజానికి సందేశమిచ్చే సినిమాలు తీస్తున్న మహేష్ బాబు అసలు సిసలు హీరో అని  పొగిడేస్తున్నారు అభిమానులు. 

అదే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ పొగడ్తలు తలనొప్పిగా మారాయి. ఫామ్ హౌస్ లో గడ్డి పీకుతున్నట్టు, చెట్టు కింద కూర్చుని చద్దన్నం తింటున్నట్టు ఫొటోలు దిగే పవన్ కల్యాణ్.. సమాజం కోసం ఒక్క సినిమా అయినా చేశారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతమవుతున్నాయి. ఇలా మహేష్, పవన్ ని పోల్చి చూస్తూ ఫ్యాన్స్ హంగామా మొదలెట్టేశారు. 

మాటలు చెప్పకుండా సైలెంట్ గా సమాజం కోసం ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి మహేష్ బాబు అని, అందుకే గ్రామాన్ని సైతం దత్తత తీసుకున్నారని సపోర్ట్ చేస్తున్నారు. అదే సమయంలో పవన్ పొలిటికల్ ఎంట్రీపైనా సెటైర్లు పడుతున్నాయి. రాజకీయాల్లోకి రావాలనుకున్న సమయంలో కూడా పవన్ ఎలాంటి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు తీయలేదని, కేవలం కమర్షియల్ సబ్జెక్ట్ ల వెంటే పడ్డారని పాత చరిత్రలు తవ్వుతున్నారు. 

ఆ మాటకొస్తే మహేష్ తన సొంత డబ్బులతో ఓ ఊరిని దత్తత తీసుకున్నారని, పవన్ అలా చేయలేదంటున్నారు. సొంత బావ ఎంపీ సీటుకి పోటీ చేస్తున్నా మహేష్ ఎక్కడా ప్రచారం చేయలేదని, పవన్ మాత్రం తన అన్నకి ఎంపీ సీటిచ్చి మరీ పోటీ చేయించారని, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించారని మండిపడుతున్నారు. 

మొత్తమ్మీద మహర్షి సినిమాతో మరోసారి మహేష్-పవన్ ఫ్యాన్స్ మధ్య యుద్ధం మొదలైంది. ఓ సినిమా హిట్ అయినప్పుడు ఫ్యాన్స్ ఇలా కొట్టుకోవడం కామన్ అయిపోయింది ఈమధ్య.